శనివారం 28 నవంబర్ 2020
Nalgonda - Nov 22, 2020 , 00:56:53

గ్రేటర్‌ పోరులో మనోళ్లే కీలకం

గ్రేటర్‌ పోరులో మనోళ్లే కీలకం

  • 25డివిజన్లలో ఉమ్మడి జిల్లావాసుల ఓట్లు
  • గెలుపోటముల్లో కీలకపాత్ర
  • మూడు లక్షల పైచిలుకు ఓట్లు
  • జిల్లా నేతలకే గెలుపు బాధ్యతలు 
  • ప్రచారంలో కదంతొక్కుతున్న శ్రేణులు 

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఇప్పుడు రాజకీయంగా అందరి దృష్టి జీహెచ్‌ఎంసీ ఎన్నికలపైనే కేంద్రీకృతమై ఉంది. రాష్ర్టానికే గుండెకాయ లాంటి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు కావడంతో అందరూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అయితే హైదరాబాద్‌ నగర అభివృద్ధికి ఆరేళ్లుగా వేల కోట్ల రూపాయలను వ్యయం చేసి విశ్వవ్యాప్త నగరంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. గత ఎన్నికల్లోనూ ఏకపక్ష మెజార్టీతో మేయర్‌ పీఠంపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసింది. ఈ సారి కూడా ప్రజ ల్లో ప్రస్తుతం ఉన్న ఆదరణను బట్టి ఇంకా ఎక్కువ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయినా సరే టీఆర్‌ఎస్‌ తనదైన వ్యూహంతో ముందుకు సా గుతుంది. గెలుపే లక్ష్యంగా ముఖ్యనేతలతో పాటు కింది శ్రేణుల వరకు ప్రచారంలో పాల్గొంటున్నా రు. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాం గ్రెస్‌, బీజేపీలతో పాటు ఇతర పార్టీలు కూడా సన్నహాలు చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో నగర శివారు ప్రాంతాల్లోని డివిజన్లలో వాటి కి అనుకుని ఉన్న జిల్లావాసుల ఓట్లు కీలకంగా మారనున్నా యి. కొన్నేళ్లుగా హైదరాబాద్‌కు వలసవచ్చి నివాసాలు ఏర్పరుచుకున్న వారు ఓటర్లు గా నమోదై ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో సంబంధం ఉన్న సుమారు 3లక్షల మంది పలు డివిజన్లలో ఓటర్లుగా ఉన్నారు. వీరంతా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 

25 డివిజన్లలో జిల్లా ఓటర్లు కీలకం...

జీహెచ్‌ఎంసీలోని 25 డివిజన్లల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఓటర్లు కీలకంగా మారనున్నారు. కొ న్ని డివిజన్లలో మెజార్టీ ఓటర్లు జిల్లాతో సంబంధం ఉన్నవారే ఉన్నట్లుగా తెలుస్తోంది. నల్లగొండ జిల్లాతో నిత్య సంబంధాలు ఉండే ఎల్‌బీనగర్‌ నియోజకవర్గపరిధిలో 11డివిజన్లు ఉన్నాయి. యాదాద్రి జిల్లాతో నిత్యసంబంధాలు ఉండే ఉప్ప ల్‌ నియోజకవర్గ పరిధిలో 10 డివిజన్లు ఉన్నాయి. వీటితో పాటు మలక్‌పేట నియోజకవర్గ పరిధిలో మూడు డివిజన్లు, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో రెండు డివిజన్లలలోనూ ప్రభావం చూపే స్థాయిలో జిల్లా ఓటర్లున్నారు. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ పరిధిలోని నాగోల్‌, మన్సూరాబాద్‌, హ యత్‌నగర్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్‌, హస్తినాపూర్‌, చంపాపేట, కొత్తపేట, చైతన్యపురి, గడ్డిఅన్నారం, లింగోజిగూడెం డివిజన్లలో మొత్తం 5.42 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 1.50లక్షల మంది వరకు ఉమ్మడి జిల్లాతో సంబంధం ఉన్న ఓటర్లే ఉంటారని అంచనా. ఇక ఉప్పల్‌ నియోజకవర్గ పరిధిలో 10 డివిజన్లలో 4.78లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో కనీసం లక్ష మంది ఓటర్లు జిల్లాతో సంబంధం ఉన్నవారేనని తెలుస్తోంది. ఉప్పల్‌, రామంతాపుర్‌, చిలుకానగర్‌, నాచారం, మల్లాపూర్‌, మీర్‌పేట్‌, హెచ్‌బీ కాలనీ, చర్లపల్లి, ఏఎస్‌.రావు నగర్‌, కాప్రా, హబ్సీగూడలోనూ పూర్వపు జిల్లావాసుల ఓట్లు అధికమే. మలక్‌పేట నియోజకవర్గం పరిధిలోని సైదాబాద్‌, అక్బర్‌బాగ్‌ డివిజన్లలోనూ జిల్లావాసులకు భారీగానే ఓట్లు ఉన్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్‌నగర్‌, ఆర్‌కేపురంలలోనూ జిల్లాతో సంబంధం ఉన్న ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్న వారిలో కొందరికీ జిల్లాతో పూర్వ పు సంబంధాలున్నాయి. దీంతో ఈ డివిజన్ల పరిధిలో జరుగుతున్న ఎన్నికలు జిల్లావాసుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఈ డివిజన్ల పరిధిలోని ఎ న్నికల ప్రచారంలో హైదరాబాద్‌ అభివృద్ధి అంశాలతో పాటు జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు   ప్రచార అస్ర్తాలుగా మారనున్నాయి. 

జిల్లా నేతలంతా అక్కడే మకాం...

జిల్లాతో సంబంధం ఉన్న ఓటర్లు కీలకంగా ఉం డడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన రాజకీయపార్టీల నేతలంతా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. ఆయా పార్టీల అధినాయకత్వం ఆదేశాలతో రెండుమూడు రోజుల కిందటే అక్కడికి తరలివెళ్లారు. టీఆర్‌ఎస్‌ ముఖ్యులైతే ఇప్పటికే ప్రచారంలోనూ కీలకంగా మారారు. మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా సరూర్‌నగర్‌ డివిజన్‌ బాధ్యతలు చూస్తుండగా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ముఖ్యనేతలంతా ఒక్కో డివిజన్‌కు ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. వీరంతా నామినేషన్ల నాటి నుంచే అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. డివిజన్ల వారీగా ముఖ్యనేతలంతా తమకు అప్పగించిన బాధ్యలు చేపట్టారు. ఆదివారం సాయంత్రంతో అభ్యర్థుల తుదిజాబితా వెల్లడికానుండడంతో ప్రచారం మరి ంత ఊపందుకోనుంది. ప్రచారానికి ఎక్కువ గడు వు లేకపోవడంతో తక్కువ సమయంలోనే వీలై నంత ఎక్కువ మంది ఓటర్లను కలిసే వ్యూహంలో ఉన్నా రు. అదేవిధంగా ఆయా డివిజన్ల వారీగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి ఓటు అభ్యర్థించాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌ నగర సమగ్రాభివృద్ధి సీఎం కేసీఆర్‌, ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌తోనే సాధ్యమనే సంకేతాన్ని ఇస్తున్నారు. నగరంలో ఎలాంటి మతకల్లోలాలకు తావులేకుండా పకడ్బందీ శాంతిభద్రతలతో ప్రశాంతనగరంగా తీర్చిదిద్దడంలో కలిసిరావాలని పిలుపునిస్తున్నారు. దీంతో పాటు ఉ మ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన అభివృద్ధిని కూడా ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొడుతూ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్న బీజేపీ లాంటి పార్టీలకు బుద్ధ్దిచెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు చెందిన కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్షాల నేతలు కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్నారు. జిల్లావాసులతో సంబంధం ఉన్న డివిజన్లన్నింటిలోనూ ఉమ్మ డి జిల్లాకు చెందిన అన్నిపార్టీల నేతలు, కార్యకర్తలు ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావేదికగా... ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వేదికగా జిల్లా నేతలు విమర్శనాస్ర్తాలు సంధించుకోనున్నారు.