శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nalgonda - Sep 17, 2020 , 00:56:21

చేనేత ఉత్పత్తులకు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ అవకాశం

చేనేత ఉత్పత్తులకు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ అవకాశం

  • చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు మహ్మద్‌ జహీరొద్దీన్‌

రామగిరి : చేనేత ఉత్పత్తులకు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సదుపాయం కల్పించినట్లు ఆశాఖ సహాయ సంచాలకుడు మహ్మద్‌ జహీరొద్దీన్‌ వెల్లడించారు. బుధవారం నల్లగొండలోని ఆశాఖ కార్యాలయంలో కొవిడ్‌ నిబంధనలతో సమావేశం నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించి మాట్లాడారు.

చేనేత పారిశ్రామిక ఉత్పత్తులకు సరియైన మార్కెటింగ్‌ సదుపాయం లేక నష్టపోతున్నారని అందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో మార్కెటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-మార్కెటింగ్‌పై  అవగాహన కల్పించారు. ఆశాఖలో పనిచేస్తున్న అధికారులకు ఈ-మార్కెటింగ్‌ యాప్‌ పనితీరు, ఉపయోగంపై వివరించారు.  యాప్‌పై అవగాహన కల్పించి అందరు సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని అధికారులను కోరారు.

అదేవిధంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని చేనేత కార్మికులు, కళాకారులు ఈ మార్కెటింగ్‌లో వారి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు www.gem.gov.inలో సంప్రదించాలని సూచించారు.