సోమవారం 30 మార్చి 2020
Nalgonda - Feb 22, 2020 , 04:40:00

శివనామస్మరణతో మార్మోగిన చెర్వుగట్టు

శివనామస్మరణతో మార్మోగిన చెర్వుగట్టు

నార్కట్‌పల్లి : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి క్షేత్రం శుక్రవారం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. వేకువజామునుండే భక్తులు కోనేటిలో పుణ్యస్నానమాచరించి భక్తిశ్రద్ధలతో ఓం శివా నమః శివా అంటూ స్వామివారిని దర్శించుకున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా దూరప్రాంతాలనుండి భక్తులు స్వామివారి దర్శనమే మహాభాగ్యమంటూ బారులు తీరారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి సకలీకరణం, ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చనలు, బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన, సుప్రభాత సేవ, భక్తుల శివపూజలు తదితర పూజలు ఘనంగా నిర్వహించారు. లేబర్‌, ఎంప్లాయిమెంట్‌, ఫ్యాక్టరీస్‌, బైల్డర్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, సూర్యాపేట జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జా దీపికాయుగంధర్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎస్పీ రంగనాధ్‌, జేసీ చంద్రశేఖర్‌ స్వామివారికి అభిషేకాలను ప్రారంభించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. 


అంతకుముందు ఆలయ సంప్రదాయం ప్రకారం దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఈఓ అన్నెపర్తి సులోచన, ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మలు పూర్ణకుంభంతో ఎదురేగి డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ పాలకమండలి, దేవాలయ సిబ్బంది అన్ని వసతులు కల్పించారు. శివ భక్తులు గట్టుపై జాగరణ చేసేందుకు భగవంతుని ప్రవచనలు, హరికథ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అభివృద్ధి కమిటీ చైర్మన్‌, ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, సర్పంచ్‌ మల్గ బాలకృష్ణ, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, సూపరింటెండెంట్‌ తిరుపతిరెడ్డి, దోసపాటి విష్ణు, పసునూరి శ్రీను, దుబ్బాక శ్రీధర్‌, మేకల కరుణాకర్‌ రెడ్డి, గుండె రవి, మహేష్‌, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.


logo