నకిరేకల్, డిసెంబర్ 11 : దేశ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో నకిరేకల్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత, నాయకులు పార్టీలో చేరుతున్నారన్నారు. బీఆర్ఎస్ బలోపేతానికి యువత పార్టీకి సైనికుల్లా పనిచేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో గుడిపెల్లి నరేందర్ రెడ్డి, వంటెపాక కల్యాణ్, గుత్తా దామోదర్ రెడ్డి, వంటెపాక రాజు, సూరారపు లింగరాజు, బొజ్జ సందీప్, ఎడ్ల నవీన్, రావుల సైదులు పాల్గొన్నారు.