Grain procurement centers, Ananthagiri, Suryapet news
అనంతగిరి, ఏప్రిల్ 06 : అనంతగిరి మండలంలోని ఖానాపురం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసీల్దార్ హిమబిందు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. మధ్య దళారుల ద్వారా నష్ట పోకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం రైతులకు లాభం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కేంద్రంలో ధాన్యం తూకం, చెల్లింపుల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాలలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఏఓ దేవపంగు ప్రసాద్, సర్పంచ్ కంటూ లాజర్, ఉప సర్పంచ్ గింజుపల్లి జగన్, సంఘ సీఈఓ ఉయ్యాల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ గాదె వెంకన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కనగాల వీరయ్య, మండల ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ కోటేశ్వరరావు, గింజుపల్లి సురేశ్, సంఘ సిబ్బంది వీరయ్య, మాధవి, రైతులు పాల్గొన్నారు.