నారాయణపేట: జిల్లాలో మైనర్ బాలిక హత్య కేసు ( Murder Case ) ను నారాయణ పేట పోలీసులు ఛేదించారు . గత నెల 31న ఐదేళ్ల బాలిక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా వచ్చిన నివేదిక ప్రకారం బాలికపై లైంగిక దాడి జరిపి హత్య చేసినట్లు నిర్ధారితమైంది.
దర్యాప్తులో భాగంగా అమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిన్న నరసింహులు అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా నేరం అంగీకరించడంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు ( Arrest ) చేశారు . నిందితుడిపై 2014 సంవత్సరంలో నారాయణపేట పోలీస్ స్టేషన్లో అత్యాచారం ప్రయత్నం కేసు నమోదైనట్లు వెల్లడైంది నారాయణపేట జిల్లా ఎస్పీ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.