కార్మికులు మెచ్చే వేతన ఒప్పందం సాధిస్తాం
రాబోయే పాతికేండ్ల పాటు కార్మికులు మెచ్చే వేతన ఒప్పందాన్ని తీసుకువస్తామని బీఆర్ఎస్కేవీ పీఈఎల్ విభాగం అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి హామీనిచ్చారు. మండలంలోని పెద్దకందుకూరు గ్రామంలో శుక్రవారం ప్రీమియర్ ఎక్స్‌ఫ్లోజివ్ కంపెనీ లిమిటెడ్(పీఈఎల్) బీఆర్ఎస్కేవీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.
- బీఆర్ఎస్కేవీ పీఈఎల్ విభాగం అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి
యాదగిరిగుట్ట, మార్చి 21 : రాబోయే పాతికేండ్ల పాటు కార్మికులు మెచ్చే వేతన ఒప్పందాన్ని తీసుకువస్తామని బీఆర్ఎస్కేవీ పీఈఎల్ విభాగం అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి హామీనిచ్చారు. మండలంలోని పెద్దకందుకూరు గ్రామంలో శుక్రవారం ప్రీమియర్ ఎక్స్‌ఫ్లోజివ్ కంపెనీ లిమిటెడ్(పీఈఎల్) బీఆర్ఎస్కేవీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు దఫాలుగా గతంలో ఏ కార్మిక సంఘమూ సాధించలేని విధంగా గొప్ప వేతన ఒప్పందాన్ని తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్కేవీదేనన్నారు. కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ.60 లక్షల పరిహారంతోపాటు కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాన్ని సాధించామని గుర్తుచేశారు.
2023లో చంద్రుడిపైన అడుగు పెట్టిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్లో ఉపయోగించిన జీఎస్ఎల్వీ మార్క్-3లో ఎస్-200 బూస్టర్‌ను అందించిన పీఈఎల్ కంపెనీ కార్మికుల పాత్రను అభినందించారు. ఇస్రో చేసిన ఎన్నో ప్రయోగాలకు సాలిడ్ ప్రొపలెంట్ బూస్టర్‌ను అందించేందుకు కూడా కృషి చేశారని తెలిపారు. ఈ నెల 29న జరిగే కంపెనీ అధికారిక కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్‌తో కలిసి పోటీలో దిగుతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్కేవీలో 140 మంది, బీఎంఎస్‌లో 93 మంది కార్మికులు ఉన్నట్లు చెప్పారు.
కార్మికులు ఆలోచించి అండగా నిలిచే బీఆర్ఎస్కేవీ ‘బాణం’ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్కేవీ పీఈఎల్ విభాగం జనరల్ సెక్రటరీ బరిగెల నర్సింహులు, వర్సింగ్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి, ఉప కార్యదర్శి పాపయ్య, ఉపాధ్యక్షుడు గట్టికొప్పుల లక్ష్మీనర్సయ్య, కోశాధికారి గవ్వల రమేశ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ, నాయకులు గుండ్లపల్లి వెంకటేశ్‌గౌడ్, సీస రమేశ్‌తోపాటు, బీఆర్ఎస్కేవీ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

