మహిళలు, చిన్నారులకు ‘సఖీ’ భరోసా

- కలెక్టర్ శర్మన్‌చౌహాన్
- సైకియాట్రిస్ట్‌ను ఏర్పాటు చేయాలని న్యాయ సేవా కార్యదర్శి సూచన
నాగర్‌కర్నూల్ టౌన్, ఫిబ్రవరి 22: గృహహింస సమస్యలతో సతమతమవుతున్న మహిళలు, అమ్మాయిలకు పూర్తి భరోసా కల్పించేందుకు సఖీ వన్ స్టాఫ్ కేంద్రం కృషి చేస్తున్నదని కలెక్టర్ శర్మన్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి నిర్వహణ కమిటీకి కలెక్టర్ అధ్యక్షత వహించారు. మండలాలు, గ్రామాల్లో అమాయక మహిళలు, అత్యాచారాలకు గురవుతూ బయటకు చెప్పుకోలేని వారికి సఖీ సెంటర్లో తగిన న్యాయం కల్పిస్తామన్నారు. వైద్యం, షెల్టర్, న్యాయ సలహాలు అందించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. మహిళలు నేరుగా టోల్ ఫ్రీ నెంబర్ 181 లేదా 9951940181 లేదా 08540-298000 నెంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. మండల, గ్రామస్థాయిలో మహిళలను చైతన్యం చేసేందుకు అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సఖీ కేంద్రానికి జిల్లాలో శాశ్వత భవనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లా న్యాయ సేవా కార్యదర్శి వెంకట్రామ్ మాట్లాడుతూ సఖీ కేంద్రానికి వచ్చే మహిళలకు అవగాహన కల్పించేందుకుగానూ ఒక సైకియాట్రిస్ట్‌ను నియమిస్తే బాగుంటుందని కలెక్టర్‌కు సూచించారు. జిల్లా సంక్షేమాధికారి ప్రజ్వల మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 400 కేసులు నమోదు కాగా ఇందులో 276 గృహహింస, 18 పోక్సో కేసులు, 28 బాల్య వివాహాలు, 25 మిస్సింగ్ కేసులు, 13 సైబర్ క్రైమ్, ప్రేమ మోసాలు, 30 ఇతర కేసులు నమోదైనట్లు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మనూచౌదరి, ట్రైనీ కలెక్టర్ చిత్రమిశ్రా, డీఈవో గోవిందరాజులు, ఎన్జీవో తరఫున లక్ష్మణ్‌రావు, గోవర్ధిని పాల్గొన్నారు.
తాజావార్తలు
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!
- కార్న్ దోశ
- మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు
- శశికళ సంచలన నిర్ణయం..
- గోల్డెన్ రేజర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న సెలూన్ ఓనర్
- ఈ శుక్రవారం విడుదలవుతున్న 9 సినిమాలు ఇవే!
- బంగారం వద్దు ఇల్లే ముద్దు.. 70 % మంది మహిళల మనోగతం!
- బొలేరో, ఆటో ఢీ.. ఒకరి మృతి, ఆరుగురికి గాయలు
- కోట్లు పలికిన పదిసెకన్ల వీడియో