పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి

- అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి
ములుగు కలెక్టరేట్, నవంబర్ 23 : అధికారులు తమ శాఖల్లో పెండింగ్ సమస్యలపై దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా విజ్ఞప్తులపై రోజు వారీ సమీక్ష చేసి వెంటనే పరిష్కరించాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించి ఏఏ సమస్యలపై వినతులు వస్తున్నాయో, ఎంతకాలం నుంచి పెండింగ్ ఉంది శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక కార్యాచరణతో పరిష్కరించాలన్నా రు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేయాలన్నారు. మినీ డెయిరీ పైలట్ ప్రాజెక్టు అమలుకు 20 ఎకరాల స్థలం కేటాయించినట్లు, షెడ్డు నిర్మాణాలు, పశువుల కొనుగోలుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈనె ల, వచ్చే నెల పశుగ్రాసం ఏర్పాటు చేసుకోవాలని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలుకు 170 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వ్యవసాయ విస్తరణ అధికారులు రెగ్యులర్‌గా కేంద్రాలను సందర్శించి రిమార్కులు ఫొటో గ్రాఫ్‌తో పాటు సమర్పించాలన్నారు. జాకారం గ్రామంలో అటవీ భూ వివాదంలో శాటిలైట్ చిత్రాలతో రెవెన్యూ గ్రామ మొత్తం విస్తీర్ణం గెజిట్ ప్రకారం అటవీ భూమి తదితర వివరాలన్నీ సేకరించి పరిష్కరించాలన్నారు. ఎస్‌డీఎల్‌పీ స మావేశంలో (3)1 కేసులు పరిష్కరించాలని 3(2) కేసుల విషయమై చర్చించాలన్నారు. ఈ-ఆఫీస్ నిర్వహణకు కావాల్సిన కంప్యూటర్, స్కానర్ పరికరాలకు ఇండెంట్ సమర్పించాలన్నారు. కన్నాయిగూడెం ఎంపీడీవో కార్యాలయ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారిణి రమాదేవి, డీఆర్డీవో పారిజాతం, జడ్పీసీఈవో ప్రసూనారాణి, అధికారులు పాల్గొన్నారు.