శనివారం 08 ఆగస్టు 2020
Mulugu - Jun 15, 2020 , 02:51:24

తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలి

తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలి

ములుగు, జూన్‌14: తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో రాష్ట్ర ఆవశ్యకతను తెలిపేందుకు ప్రతీ నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ములుగు నియోజకవర్గంలోనూ జాతీయ రహదారి పక్కనే ఏర్పాటుచేయగా ఇటీవల జరిగిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఈ విగ్రహాన్ని తొలగించి ఇలా పక్కన పెట్టారు. ప్రస్తుతం ములుగు జిల్లాగా ఏర్పడడంతో జిల్లాకేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం ఉద్యమకారులు, అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు పట్టించుకొని ప్రత్యేక శ్రద్ధతో జాతీయ రహదారి డివైడర్‌ మధ్యలో భారీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలని ఉద్యమకారులు, అభిమానులు, ప్రజలు కోరుతున్నా రు. ఇటీవల రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగినప్పుడు విగ్రహం లేకపోవడంతో తాత్కాలికంగా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలగించిన స్థలంలో కానీ, ఏరియా దవాఖానా ఎదురుగా గానీ, బస్టాండ్‌ సమీపంలో కానీ విగ్రహం ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.


logo