గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Mar 07, 2020 , 02:09:22

జేపీఎస్‌ ఏజెన్సీ సర్టిఫికెట్ల పరిశీలన

జేపీఎస్‌ ఏజెన్సీ సర్టిఫికెట్ల పరిశీలన

ఏటూరునాగారం, మార్చి 06 : జిల్లాలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్‌) నియామకానికి సంబంధించి  శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో ఏజెన్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను పీవో హన్మంత్‌ కొండిబా ఆధ్వర్యంలో పరిశీలించారు. జిల్లాలోని ములుగు, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లో 29 మంది జూనియర్‌ పంచాయితీ కార్యదర్శులను ఎంపిక చేశారు. వీరి నియామకం కోసం ఏజెన్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయాల్సి ఉంది. దీంతో డీఎల్‌ఎస్‌సీ (డిస్ట్రిక్‌ లెవల్‌ స్క్రూటినీ కమిటీ) ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. డీటీడీవో ఎర్రయ్య, ములుగు ఆర్డీవో రమాదేవి, ట్రైబల్‌ కల్చర్‌ అండ్‌ నీసెర్చ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శంకర్‌తోపాటు ఏజెన్సీ మండలాలకు చెందిన తహసీల్దార్లు పాల్గొన్నారు. గతంలో జారీ చేసిన ఏజెన్సీ సర్టిఫికెట్లు సరైనవా లేదా 1950 నుంచి సరైన ఆధారాలతో కూడిన సర్టిఫికెట్లు అభ్యర్థుల వద్ద  ఉన్నాయో లేదో అధికారులు పరిశీలించారు. 


పనుల ప్రతిపాదనల తీర్మానాలు అందజేయాలి

ఉపాధి హామీ కింద  మంజూరైన రోడ్డు పనులకు సంబంధించి ప్రతిపాదన తీర్మానాలు గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ విభాగంలో వెంటనే అందజేయాలని ఐటీడీఏ పీవో హన్మంత్‌ కొండిబా సూచించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం గోవిందరావుపేట, వాజేడు, వెంకటాపురం, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాలకు ఈజీఎస్‌ కింద సీసీ రోడ్ల నిర్మాణం కోసం సుమారు రూ.8 కోట్ల వరకు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు సర్పంచ్‌లు అందజేయాల్సి ఉంది. కాగా, వెంటనే వీటి ప్రతిపాదనలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయా మండలాలకు చెందిన ఎంపీవోలను పీవో ఆదేశించారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఈఈ మురళీ మోహన్‌, డీఈఈలు మధుకర్‌, నిరంజన్‌, డీఎల్‌పీవో దేవరాజ్‌,  ఎంపీవోలతోపాటు తదితరులు పాల్గొన్నారు. 


logo