జిన్నారం, అక్టోబర్ 20 : పటాన్చెరు నియోజకవర్గం నుంచి గూడెం మహిపాల్‌రెడ్డిని మూడోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు యువకులు నినదించారు. మహిపాల్‌రెడ్డి విజయానికి పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. శుక్రవారం ఊట్ల గ్రామశివారులోని ఎన్ఆర్ఎస్ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ యువ జన విభాగం మండలాధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో యువజన సమావేశం నిర్వహించారు. యువజన సమావేశానికి అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ర్యాలీ గా రైస్‌మిల్ వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీగా ఫంక్షన్ హాల్‌కు చేరారు. జై బీఆర్ఎస్.. జై కేసీఆర్.. జై జీఎంఆర్ నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. సమావేశానికి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తనయుడు, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు విక్రమ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విక్రమ్‌రెడ్డిని గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గూడెం విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో యువతకు సముచితమైన స్థానం ఉంటుందన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధికి యువత తోడు కావడంతో మరింత బలం పెరిగిందన్నారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకొని, కావాల్సిన అభివృద్ధిని చేసుకుందామన్నారు.
జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ప్రభుత్వ నిధులే కాకుండా సీఎస్ఆర్, సొంత ఖర్చుతో అభివృద్ధి పను లు చేశారన్నారు. పటాన్చెరులో జరిగిన అభివృద్ధి జిల్లాలో ఎక్కడా జరగడం లేదు. మహిపాల్‌రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకటేశంగౌడ్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ విజ యానికి కృషి చేయాలన్నారు. వావిలాల గ్రామానికి చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ నాయికోటి మురళి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. యువజన సమావేశంతో యువకుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.
సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజేశ్, సర్పంచ్‌లు ప్రకాశ్‌చారి, చెట్టి శివరాజ్, చిట్ల సత్యనారాయణ, ఆంజనేయులు, జనార్దన్, ఖదీర్, నాయకులు బేల కృష్ణ, నరేందర్, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గద్దె నర్సింహ, ఆకుల నవీన్‌కుమార్, భీమ్రావు, మహేశ్, వరుణ్, శ్రీధర్‌గౌడ్, రాజ్‌కుమార్, రమేశ్, గణేశ్ పాల్గొన్నారు.