ఆలేరు, భువనగిరి సెగ్మెంట్లు, గజ్వేల్‌తోపాటు మేడ్చల్ జిల్లాకు మల్లన్నసాగర్ నీటి శుద్ధీకరణ కేంద్రం నుంచి తాగునీరు సరఫరా చేయడానికి అవసరమైన పనులను త్వరగా పూర్తి చేయాలని మిషన్‌భగీరథ రాష్ట్ర కార్యదర్శి స్మితాసబర్వాల్ అధికారులను ఆదేశించారు. గురువారం కొండపాక మండలం మంగోలు వద్ద మల్లన్నసాగర్ నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమైన కూడళ్లు, రైల్వేలైన్లు, కాల్వల ప్రాంతాల్లో పైపులైన్ పనులను, పంప్‌హౌస్ పనులను పూర్తి చేసి సెప్టెంబరు 15లోగా ఆలేరు, భువనగిరి సెగ్మెంట్లకు తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.
గజ్వేల్ అర్బన్, జూలై 13 : ఆలేరు, భువనగిరి సెగ్మెంట్లు, గజ్వేల్‌తోపాటు మేడ్చల్ జిల్లాకు మల్లన్నసాగర్ నీటి శుద్ధీకరణ కేంద్రం నుంచి తాగునీరు సరఫరా చేయడానికి అవసరమైన పనులను యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలని మిషన్ భగీరథ రాష్ట్ర కార్యదర్శి స్మితాసబర్వాల్ అధికారులను ఆదేశించారు. గురువారం కొండపాక మండలం మంగోలు వద్ద మల్లన్నసాగర్ నీటి శుద్ధీకరణ కేం ద్రాన్ని మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, సీఈ విజయ్‌ప్రకాశ్‌లతో కలిసి ఆమె సందర్శించారు.
మల్లన్నసాగర్ నీటి శుద్ధీకరణ కేంద్రం నుంచి పైపులైన్ నిర్మాణం చేపడుతున్న కూడవెళ్లి వాగు, కొడకండ్ల వద్ద గల కొండపోచమ్మ కెనాల్, రైల్వే క్రాసింగ్ కుకునూరుపల్లి, బొప్పాయిపల్లి ఎంఐ టాంక్లతోపాటు అక్కారంలో నిర్మిస్తున్న పంప్‌హౌస్ పనులను స్మితాసబర్వాల్ పరిశీలించగా ఈఈ రాజయ్య పెండింగ్ పనుల వివరాలను తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమైన కూడళ్లు, రైల్వేలైన్లు, కాల్వల ప్రాం తాల్లో పైపులైన్ పనులను, పంప్‌హౌస్ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు15లోగా ఆలేరు, భువనగిరి సెగ్మెంట్లకు మల్లన్నసాగర్ నీటి శుద్ధీకరణ కేంద్రం నుంచి తాగునీటిని సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో మిషన్‌భగీరథ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు కూడా ఉన్నారు. మంగోల్ నీటి శుద్ధీకరణ కేంద్రం ప్రాంగణంంలో హరితహారంలోభాగంగా అధికారులతో కలిసి స్మితాసబర్వాల్ మొక్క నాటారు.