చిన్నకోడూరు, ఫిబ్రవరి 10: ఈనెల 13 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే మండల స్థాయి కేసీఆర్ వాలీబాల్ టోర్నీని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ పిలుపు నిచ్చారు. చిన్నకోడూరులో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని చిన్నకోడూరులో ఈనెల 13, 14, 15 తేదీల్లో జరిగే టోర్నీలో క్రీడాకారులు పాల్గొంటారని, 17న సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపారు.
ఈ టోర్నీలో 40 టీమ్‌లు పాల్గొంటాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ క్రీడలను ప్రోత్సహించారని, గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. 20 ఏండ్లుగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఇందులో భాగంగా క్రీడలు నిర్వహిస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. మండల సమన్వయకర్త పాల సాయిరాం, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిద్దిపేటను ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు క్రీడా హబ్‌గా మార్చేందుకు ఎంతగానో కృషి చేశారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో ఎకడా లేని విధంగా సిద్దిపేటలో క్రికెట్ మినీ స్టేడియం నిర్మించిన ఘనత ఆయనకే దకిందన్నారు. ఫైనల్లో గెలిచిన క్రీడాకారులకు మొదటి బహుమతి లక్ష రూపాయలు నగదు, రెండో బహుమతి రూ.75 వేలు, మూడో బహుమతి రూ.50వేలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. హరీశ్‌రావు సూచన మేరకు ప్రతిరోజు క్రీడాకారులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కనకరాజు, ఉమేశ్ చంద్ర, జంగిటి శ్రీనివాస్, ఎల్లయ్య, గుండెలు వేణు, గుజరాజు, రవి, రమేశ్, వినయ్, లింగం, గణేశ్, రఘు, రాజు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.