జహీరాబాద్, ఫిబ్రవరి 3 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని సిద్ధి సరస్వతి పంచవటి క్షేత్రం(Siddhi Saraswati Kshetram) భక్తుల దర్శనాలతో కిక్కిరిసిపోయింది. సోమవారం చదువు తల్లి సరస్వతీ దేవి జన్మదిన స్వామి పురస్కరించుకొని స్థానిక క్షేత్ర పీఠాధిపతి సకల మతస్థాపికుడు సద్గురు కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో ప్రముఖ వేద పండితుడు అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన అభిషేకం హారతి తదితర ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం క్షేత్రంలోని సరస్వతీ దేవి ఆలయ ఆవరణలో అష్టదశ శక్తి పీఠాల అమ్మవారి విగ్రహాలను వేద పండితుల మంత్రోచ్ఛల మధ్య ప్రతిష్టించారు.
తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి క్షేత్రంలోని జ్యోతిర్లింగాలు సాయిబాబా వెంకటేశ్వర స్వామి సూర్య భగవాన్ ఆలయాలను సందర్శించి భక్తులు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో భాజా భజంత్ర హోరు మధ్య వేలాదిమంది మహిళలు బోనాలతో ఊరేగింపుగా మాంజీర నదికి తల్లి వెళ్లారు. మంజీరా నదిలో కాశీనాథ్ బాబా తెప్పెను విడిచి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న పంచవటి క్షేత్రానికి మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి బోనాలను నైవేద్యాలను సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.
సరస్వతీ దేవి జన్మదిన స్వామి పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు చిన్నారులను తీసుకువచ్చి వేద పండితుల మంత్రులను మధ్య అక్షరాభ్యాసాన్ని చేయించారు. అనంతరం అమ్మవారికి ఒడిబియాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఏలాంటి సంఘటన జరగకుండా జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు ఆధ్వర్యంలో హద్నూర్ పోలీసులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు