Twins | ఒకే రూపం.. ఒకే వృత్తి.. అన్న పశువుల డాక్టర్ అయితే తమ్ముడు ఆర్ఎంపీ డాక్టర్
Twins | వాళ్లిద్దరూ ఒకేలా ఉంటారు. రూపం గుర్తు పట్టకుండా ఉంటారు. దగ్గరి వాళ్లు, రోజూ చూస్తున్నవాళ్లు అయినా సరే ఒక్కోసారి ఆయనను ఈయన అనుకుంటారంటే అతిశయోక్తి కాదు. దగ్గరికి వచ్చి చూస్తే తప్పా ఇద్దరి మధ్య తేడాలేంటో తెలియని కవల రూపం వారిది.
Twins | మాములుగా అయితే కవలల్లో కొద్దో గొప్పో వేర్వేరు పోలికలుంటాయి. ఒకరు ఆడ, మరొకరు మగ అయితే గుర్తు పట్టడానికి ఎవరికైనా సులువే. కానీ అచ్చుగుద్దినట్లుండే ఈ కవల సోదరులు ఎప్పుడూ అందరినీ కంగారు పెట్టేస్తుంటారు వారి రూపంతో! ఆ అముడాల అన్నదమ్ములెవరో కాదు.. వర్గల్ మండలం నెంటూర్ గ్రామానికి చెందిన ఎల్కంటి శ్రీరాములు, లక్ష్మణ్.
వర్గల్, మార్చి 13: వాళ్లిద్దరూ ఒకేలా ఉంటారు. రూపం గుర్తు పట్టకుండా ఉంటారు. దగ్గరి వాళ్లు, రోజూ చూస్తున్నవాళ్లు అయినా సరే ఒక్కోసారి ఆయనను ఈయన అనుకుంటారంటే అతిశయోక్తి కాదు. దగ్గరికి వచ్చి చూస్తే తప్పా ఇద్దరి మధ్య తేడాలేంటో తెలియని కవల రూపం వారిది.
ఒకే రూపం.. ఒకే వృత్తి
ఎల్కంటి బాలమల్లయ్య-చంద్రకళ దంపతులకు 1972 లో అరగంట వ్యవధిలోనే ఒకే కాన్పులో శ్రీరాములు, లక్ష్మణ్ జన్మించారు. ఇందులో రాంబాబు పెద్ద. శ్రీనివాస్ చిన్న. చంద్రకళ అక్కకు సంతానం లేకపోవడంతో చిన్నతనంలోనే చౌదర్పల్లి గ్రామంలోని వారి చెల్లెలికి దత్తత ఇచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరి పేర్లు సైతం రాంబాబు, శ్రీనివాస్ అని మారు పేర్లతో పిలువబడుతున్నారు. రాంబాబు హిందీ పండిత్ ట్రైనింగ్ పూర్తిచేసి ఉపాధ్యాయ ఉద్యోగం కోసం అప్పట్లోనే (అనగా 2001 వరకు ఎదురుచూడగా ఆ సమయంలో నోటిఫికేషన్ రాకపోవడంతో పశువైద్య వృత్తిలోకి వెళ్లాడు. రాష్ట్ర గోపాలమిత్ర సంఘం నాయకులుగా సేవలందించారు. శ్రీనివాస్ మాత్రం గజ్వేల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్యవృత్తిలో శిక్షణ పొంది ఆర్ఎంపీగా స్థిరపడ్డారు. ఒకరు పశువుల డాక్టర్. మరొకరు మనుషుల డాక్టర్. ఇద్దరి వృత్తి వైద్యం కావడంతో వారివారి వృత్తి ధర్మాన్ని పాటిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆయననుకొని ఈయనను..
రాంబాబు ఉంటున్న ఊరు నెంటూర్ అయితే శ్రీనివాస్ ఉంటున్న ఊరు చౌదర్పల్లి గ్రామం. ఇద్దరి దూరం 5కి.మీ. పశువుల వైద్యం కోసం రాంబాబు వెళితే శ్రీనివాస్ అనుకొని చేతినాడి చూసి మందులు ఇవ్వమన్న సంఘటనలు, శ్రీనివాస్ పేషెంట్ల దగ్గరికెళితే గోదలకు సూదులివ్వండి అన్న సందర్భాలు చాలా ఎదురయ్యాయని తెలుపుతారు వీరిద్దరు అన్నదమ్ములు. రాంబాబు తీరిక సమయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే, శ్రీనివాస్ మాత్రం చౌదర్పల్లి గ్రామ ఉపసర్పంచ్‌గా ఎన్నికై ప్రజాసేవలో గడుపుతున్నారు. వృత్తి వైద్యం.. ప్రవృత్తి ప్రజాసేవ, ఆధ్యాత్మికం అన్నట్లు కొనసాగుతున్నది వీరి జీవన ప్రయాణం. విశేషమేమిటంటే వీరిద్దరి చెరో కొడుకు, చెరో ఇద్దరేసి కూతుర్లు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- Telangana
- Twins
- viral news
- Wargal
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

