నారాయణరావుపేట, డిసెంబర్ 4 : మహిళల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన ‘రుతుప్రేమ’ కార్యక్రమంపై ప్రతి మహిళకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అన్నా రు.
ఆదివారం నారాయణరావుపేట మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో జరిగిన ‘రుతుప్రేమ’ కార్యక్రమంలో సీపీ పాల్గొని మాట్లాడారు. శానిటరీ ప్యాడ్స్‌కు బదులుగా పర్యావరణహితమైన శానిటరీ కప్పులను ఉపయోగించాలన్నారు. కార్యక్రమంలో డీపీవో దేవకీదేవి, బీసీ సంక్షేమ అధికారి సరోజ, డాక్టర్ శాంతి, ఎంపీపీ బాలకృష్ణ, ఎంపీడీవో మురళీధర్‌శర్మ, వైస్ ఎంపీపీ సం తోశ్ కుమార్ పాల్గొన్నారు.