మునిపల్లి, ఏప్రిల్ 7: జహీరాబాద్ నుంచి హైదరాబాద్‌కు ఎండు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు మునిపల్లి ఎస్సై రాజేశ్ నాయక్ తెలిపారు. సోమవారం మండలంలోని బుదేరా పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై మాట్లాడుతూ బీదర్ నుంచి హైదరాబాద్‌కు ఎండు గంజాయి తరలిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు మండలంలోని కంకోల్ టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.
జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న స్కూటీపై (టీజీ 08జి 5971) మహ్మద్ అయూబ్ అలీ, షేక్ సమీర్ వద్ద ఎండు గంజాయి కనిపించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. 120 గ్రాముల ఎండు గంజాయిని బీదర్‌లోని ఇరానీ గల్లీలో ఇర్ఫాన్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లు వారు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి దుండగులను పట్టుకున్న పోలీసులను కొండాపూర్ సీఐ వెంకటేశ్ అభినందించారు.