సంగారెడ్డి జిల్లా కంది మండలం మక్తతండాలో శనివారం గిరిజనులు తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. యువతులు తండాలోని దుర్గాభవానీ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పిల్లలు, మహిళలు కోలాటం ఆడారు. అనంతరం నవ ధాన్యాల మొలకల బుట్టలను సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు.
– సంగారెడ్డి ఫొటోగ్రాఫర్, ఆగస్టు 3