
మెదక్ జిల్లాలో పోస్టింగ్‌లు ఇచ్చిన కలెక్టర్ హరీశ్
మెదక్, జనవరి 10 : మెదక్ జిల్లాకు 15 మంది తహసీల్దార్లు, 10 మంది నాయబ్ తహసీల్దార్లు బదిలీపై వచ్చారని, వారికి సోమవారం పోస్టింగ్ ఇచ్చామని, వీరు ఇతర జిల్లాల నుంచి మెదక్ జిల్లాకు వచ్చారని కలెక్టర్ ఎస్.హరీశ్ తెలిపారు. ఇందులో మజార్ అలీ (సూపరింటెండెంట్-డి, కలెక్టరేట్ మెదక్), ఎన్.ఆనంద్‌బాబు(తహసీల్దార్ తూప్రాన్), వి.లక్ష్మణబాబు ( తహసీల్దార్ చేగుం ట), ఎం.జ్ఞానజ్యోతి (డీఏవో ఆర్డీవో కార్యాలయం తూప్రాన్), జె.శ్రీనివాస్‌శర్మ (తహసీల్దార్ హవేళీఘనపూర్), సి.భాస్కర్ (డీఏవో ఆర్డీవో కార్యాలయం నర్సాపూర్), ఎం.శ్రీనివాస్‌చారి( తహసీల్దార్ శివ్వంపేట), బి.కృష్ణయ్య (తహసీల్దార్ కౌడిపల్లి), సయ్యద్ శౌకత్ అలీ (సూపరింటెండెట్ ఈ, కలెక్టరేట్ మెదక్), కె.శ్రీనివాస్ (తహసీల్దార్ మెదక్), ఎం.వెంకటేశ్వర్లు (తహసీల్దార్ అల్లాదు ర్గం), ఎస్.హర్దీప్సింగ్ (తహసీల్దార్ రేగోడ్), ఎం.కమలాద్రి (తహసీల్దార్ చిలిపిచెడ్), టి.బాలవిశ్వనాథం (సూపరింటెండెంట్ ఎఫ్, జీ, కలెక్టరేట్ మెదక్), ఎంఏ మనన్ (సూపరింటెండెంట్ హెచ్ కలెక్టరేట్ మెదక్)కు పోస్టింగ్‌లు ఇచ్చామన్నారు.
నాయబ్ తహసీల్దారు వీరే..
బిజిలిపురం ఆదర్శ్‌కుమార్ (చిలిపిచెడ్), నీరడి శ్రీకాంత్ (మనోహరాబాద్), బి.వరప్రసాద్ (తూప్రాన్), ఆర్.రామకృష్ణ (వెల్దుర్తి), డి.కిశోర్‌కుమార్ (కొల్చారం), బి.సింధూజ(నర్సాపూర్-ఈపీఐసీ), జి.దత్తారెడ్డి (ఆర్డీవో తూప్రాన్-ఎల్ఆర్, ఎల్పీ), ఎన్.ప్రణీత(ఆర్డీవో మెదక్-కేఆర్ఆర్సీ), షేక్ నయీమ్(రామాయంపేట), ఎం.ప్రభుదాస్ (శివ్వంపేట) జిల్లాకు వచ్చారని కలెక్టర్ తెలిపారు. మరో 20 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలు ఇతర జిల్లాల నుంచి మెదక్ జిల్లాకు బదిలీపై వచ్చారు.