సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి యోగం!
శరీరం, మెదడుపై మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించుకునేందుకు యోగా ఒక దివ్యౌషధం. ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే యోగా మన దేశ జీవన విధానంలో భాగమైపోయింది. శరీరం, మనస్సును సమతుల్యం చేసేందుకు చక్కటి మార్గం ఈ యోగా.
- నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
- హుస్నాబాద్‌లో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
శరీరం, మెదడుపై మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించుకునేందుకు యోగా ఒక దివ్యౌషధం. ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే యోగా మన దేశ జీవన విధానంలో భాగమైపోయింది. శరీరం, మనస్సును సమతుల్యం చేసేందుకు చక్కటి మార్గం ఈ యోగా.
హుస్నాబాద్‌టౌన్, జూన్ 20: ఆరోగ్యమే మహాభాగ్యం.. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పెంపొదించేందుకు యోగా ఎంతగానో తోడ్పడుతుంది. ప్రతినిత్యం యోగా చేయడంతో ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది.
పూర్వం కాలం నుంచే…
పురాతన కాలం నుంచి అధునిక కాలం వరకు యోగాతో జరుగుతున్న మేలును ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. వేల సంవత్సరాల నుంచి యోగా మన జీవన విధానంలో భాగంగా మారింది. మారుతున్న ప్రస్తుత సమాజంలో ఉరుకులు పరుగుల జీవితాలు, మానసిక ఒత్తిళ్లను దూరం చేసేందుకు నేటి తరానికి ఈ యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. కండరాలను బలోపేతం చేస్తూ, శరీరం, మనస్సును దృఢంగా ఉంచుకునేందుకు యోగా మేలు చేస్తుంది.
యోగాసనాలు…
జీవితంలో ఊబకాయను తగ్గించుకోవడానికి తోడు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా మనం నిత్యం యోగాసనాలు, ధ్యానం చేయడంతో ఏకాగ్రతను పెంచుతూ శరీరంలో అన్ని అవయవాలకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. పిల్లల్లో ఎదుగుదలతోపాటు ఆకలిని పెంచుతూ జీర్ణక్రియను సవ్యంగా ఉంచుతూ, జలుబు, దగ్గు, జ్వరం లాంటి రోగాలు కూడా దరి చేరకుంటా యోగా ఉపయోగపడుతున్నది. శ్వాస పద్ధతులు సక్రమంగా ఉంచుతూ, రక్త ప్రసరణను మెరుగుపర్చడం, థైరాయిడ్ తదితర వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. మనిషిపై ఒత్తిడిని తగ్గిస్తూ, జ్ఞాపక శక్తిని, ఆయుష్షును పెంచేందుకు నిత్య యోగా దోహదపడుతున్నది. సంపూర్ణ ఆరోగ్యానికి, జీవిత కాలం వ్యాధులు నయం కావడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందనేది సత్యం.
యోగా దినోత్సవానికి భారీ ఏర్పాట్లు
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం హుస్నాబాద్‌లో యోగా దినోత్సవాన్ని భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఎల్లమ్మ చెరువు కట్టపై నిర్వహించే యోగా కార్యక్రమానికి దాదాపు వెయ్యి మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. యోగాతో వస్తున్న ఫలితాలను ప్రజలకు చేరవేసేందుకు ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత తెలిపారు.
15 ఏండ్ల నుంచి యోగా చేస్తున్నా…
15 సంవత్సరాలుగా యోగా చేస్తూ శారీరకంగా, మానసికంగా అనేక లాభాలు పొందాను. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా ఆలోచిస్తూ, శరీర బరువును తగ్గించుకున్నాను. ఒత్తిడిని అధిగమించి, వివిధ రకాల వ్యాధులకు దూరంగా ఉండటానికి నాకు యోగా బాగా ఉపయోగపడింది. యోగా అన్నింటి కన్నా ఉత్తమమైనది. మన ఆలోచనా విధానం, చేసే పనిలో శ్రద్ధ ఉండాలంటే యోగాయే మార్గం. సంపూర్ణ ఆరోగ్యం పొందాలనుకునేవారు యోగాతో మంచి ఫలితాలను పొందవచ్చు. – అయిలేని అనిత, వైస్ చైర్పర్సన్, హుస్నాబాద్
ఆరోగ్యంగా ఉన్నానంటే యోగానే కారణం
నేను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నానంటే అందుకు యోగానే కారణం. 12 ఏండ్ల నుంచి యోగా చేస్తున్నా. ప్రతిరోజూ ఉదయం లేవగానే 40 నిమిషాలపాటు యోగా చేస్తా. యోగాతో రోజంతా యాక్టివ్‌గా ఉంటా. ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేస్తే అన్నింటికీ మేలు. రాష్ట్రస్థాయిలో పలు కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నా. ప్రస్తుతం పనిచేస్తున్న మల్లంపల్లి పాఠశాలలో కూడా విద్యార్థులకు యోగా నేర్పిస్తున్నాం.
– చీకోటి మహేశ్, ఉపాధ్యాయుడు, హుస్నాబాద్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

