గజ్వేల్, జూలై 1: విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ఎంతో సంతృప్తి కలుగుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నం దిని సిధారెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి ఉద్యోగ విరమణలో పాల్గొని ఆయ న సేవలను కొనియాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరీంనగర్ బిడ్డగా సిద్దిపేట డిగ్రీ కళాశాలలో చదువుకొని అదే కళాశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. గజ్వేల్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తూ ఎంతోమంది విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ఆయన చూపిన ప్రత్యేక శ్రద్ధ ఎంతో గొప్పదన్నారు. మనం పనిచేసే వృత్తిని న్యాయం చేసినప్పుడే మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యపై నమ్మకం కలిగేలా ప్రతి విద్యార్థిని ప్రతిభావంతుడిగా మార్చాలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ గణపతిరావు, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, జిల్లా ఐడెంటిఫైడ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసా ద్, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఉమాశశి, రిటైర్డు ప్రిన్సిపాల్ పాపయ్య, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.