అందోల్, అక్టోబర్ 14: ప్రతి పేదవాడి కడుపు నింపాలన్నదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచన అని.. పేదవాడి కడుపుకొట్టి పండుగపూట వారితో కన్నీళ్లు పెట్టించి ఆనందం పొందడమే కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీ అని మాజీమంత్రి హరీశ్‌రావు, మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి ధ్వజమెత్త్తారు. సోమవారం అందోల్‌లో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మె ల్యే క్రాంతి కిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవ్రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వాలన చేసి జమ్మిచెట్టుకు పూజలు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ..పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ పది నెలల పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. పం డుగలను సైతం సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి వచ్చిందని, ఆడబిడ్డలకు కనీసం బతుకమ్మ చీరలు పంపిణీ చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు రెండు బతుకమ్మ చీరలు ఇస్తామన్నా రు..? ఆ తర్వాత రూ. 500 అన్నారు… చీరలు ఎటు పాయే…రూ. 500 ఎటు పాయే అంటూ చురకలంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయడం లేదని రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు…ఉద్యోగాల ఊసేలేదని….మం త్రులు, సీఎంకు ప్రజల సంక్షేమంపై అసలు ధ్యాసే లేదని దుయ్యబట్టారు.
ఎంతసేపు కేసీఆర్‌ను తిట్ట డం…బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులనే తమ పనులుగా చెప్పుటుకుంటూ గొప్పలు పోవడం.. ఇదే అభివృద్ధి అంటూ ప్రజలను మభ్యపెటట్డంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ స్వరాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిందని…ఆ తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ఎన్నో సంస్కరణలు చేపట్టిదన్నారు. ఎన్నో బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ కష్టాల్లో నెట్టుతుందని, దీనిని ఎట్టి పరిస్థితిల్లోనూ అడ్డుకొని తీరుతామన్నారు. ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి, వారి కష్టాలు తొలిగించాలి కానీ కొత్త కష్టాలు సృష్టించ వద్దన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నదనే దానిని కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నదన్నారు. ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా బీఆర్ఎస్ సైన్యం ముందుంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఎన్నో కష్టనష్టాలకు తట్టుకుని కరువు ప్రాంతమైన నారాయణఖేడ్ వాసులకు మిషన్‌భగీరథ ద్వారా తాగునీరందించి దశాబ్దాల నీటి గోసను తీర్చారని..కానీ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్లకు నీళ్ల కష్టాలోచ్చాయన్నారు.
సంజీవ్‌రావు పేటలో మిషన్ భగీరథ నీళ్లు రాకబావి నీళ్లు తాగడంతో ఇద్దరు మృతి చెందగా, ఎంతో మంది అస్వస్థతకు గురై దవాఖానలో చేరారని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. అనంతరం అనారోగ్యంతో మృతి చెందిన మునిపల్లి మాజీ మండలాధ్యక్షుడు అల్లం నవాజ్‌రెడ్డి, పెద్ద శంకరంపేట్ మండల మాజీ మండలాధ్యక్షుడు విజయరామారావుల చిత్రపటాలకు హరీశ్‌రావు బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులపాలు చేసిందని, పండుగలను సైతం సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి ఏర్పడిందని గాయకుడు, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, గోరెటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే రసమయిబాలకిషన్ ఆటపాటలతో ప్రభుత్వ పనీతీరును ఎం డగట్టారు. బతుకమ్మ పండుగకు చీరలను సైతం అందించలేదని…రైతులకు రైతుబంధు లేదు, రుణమాఫీ చేయకుండా పండుగ పూట పస్తులుండేలా చేశారని…బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లు రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నా రన్నారు.
కేసీఆర్ పదేండ్ల పాలన…కాంగ్రెస్ పది నెలల పాలనను వివరిస్తూ ఆటపాటలతో కార్యకర్తలో మరిం త జోష్‌ను నింపారు. సుభిక్షంగా ఉన్న తెలంగాణ దుర్భిక్షంగా మారిందని….చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరిన సామేతను గుర్తుచేశారు. కళాకారుల ఆటపాటలు… మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రసంగాలతో అలయ్‌బలయ్ కార్యక్రమం ధూం ధాంగా సాగగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. గతానికి భిన్నంగా ఏడేండ్లుగా ఇక్కడ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించ డం సంప్రదాయంగా వస్తున్నదని.. అధికారం ఉన్నా.. లేకపోయినా.. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని అందుకు నిదర్శనమే ఈరోజు అలయ్బలయ్కి తరలివచ్చిన ప్రజానీకమని …మీ ప్రేమను ఎన్నడూ మరిచిపోనన్నారు.
కార్యక్రమంలో బిచ్కుంద పీఠాధిపతి సోమాయప్ప, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్, మాజీ ఎంపీపీ బాలయ్య, నాయకులు రాహుల్‌కిరణ్, పట్నం మాణిక్యం, శ్రీకాంత్‌గౌడ్, బుచ్చిరెడ్డి, లక్ష్మికాంత్‌రెడ్డి, నాగభూషణం, వీరారెడ్డి, విజయ్‌కుమార్, వెం కటేశం, శ్రీధర్, అశోక్‌గౌడ్, శివాజీరావు, పత్తివీరేషం, మల్లికార్జున్, లింగాగౌడ్, శివశేకర్. వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.