నర్సాపూర్, జనవరి 20: విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎస్‌వీఈఎస్)కు చెందిన మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు, ఫ్యాకల్టీ మెంబర్లు జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (జేఎస్టీ), జపాన్ స్పాన్సర్ చేసిన ప్రిస్టిజియస్ సకురా సైన్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు ఎంపికయ్యారని ఎస్‌వీఈఎస్ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కుమమోటో యూనివర్సిటీ, జపాన్ ప్రొఫెసర్ డా.శూచిటోరీ మార్గదర్శకత్వంలో ఏడుగురు విద్యార్థులు, 1 ఫ్యాకల్టీ మెంబర్ ఆదివారం నుంచి 25వ తేదీ వరకు పునరుత్పాదక ఇంధన వనరులు, వేస్ట్-టు-ఎనర్జీ మార్పిడి సాంకేతికతపై పరిశోధనకు అనుభవాన్ని పొందనున్నారని వెల్లడించారు.
ఎస్‌వీఈఎస్ ప్రఖ్యాత జపనీస్ యూనివర్సిటీలతో గ్లోబల్ అకడమిక్, రీసెర్స్ సహకారాలను బలోపేతం చేస్తూ విద్యార్థులు, ఫ్యాకల్టీ మెంబర్లకు అభివృద్ధి చెందిన పరిశోధన, నైపుణ్య అవకాశాలను అందిస్తొందని తెలిపారు. ఎస్‌వీఈఎస్ చైర్మన్ విష్ణురాజు ఈ ప్రోగ్రామ్‌పై తన ఉత్సాహాన్ని పంచుకుంటూ ఈ ప్రోగ్రామ్ మా కోర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు అంతర్జాతీయ పరిశోధన అవకాశాలను అన్వేషించడానికి, వారి సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చడానికి అగ్రశ్రేణి కోర్ కంపెనీల్లో విజయవంతమైన కేరీర్ కోసం సిద్ధమవ్వడానికి ఒక అద్భుతమైన వేదికను అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌వీఈఎస్ సెక్రటరీ ఆదిత్య విస్సం, డీన్ రీసెర్స్ డా.రాజు ఏడ్ల, డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, ప్రిన్సిపాల్ సంజయ్‌దూబే ఎంపికైన అభ్యర్థులను అభినందించారు.