నర్సాపూర్,మే 11: కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, రక్షకులే భక్షకులుగా మారారని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమ ర్శించారు. మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీ నామా చేయాలన్నారు. సోమవారం నర్సాపూర్‌లో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో హత్యలు, హత్యాచారాలు, లైంగిక దాడులు జరుగు తుంటే, హోంశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి స్పందించక పోవడం దారు ణమన్నారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరో గమం దిశలో పయనిస్తోందని విమర్శి ంచా రు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్ర భుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా పెడితే వెంట నే బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్న ప్రభుత్వం, ఇంత పెద్ద ఘటన జరిగితే ఫిర్యా దు చేసి 48 గంటలైనా అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. ఈ ఘట నపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని, బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు. రేవంత్‌రె డ్డిని వెనుకేసుకొచ్చే మహిళా మంత్రులు సీతక్క, కొండాసురేఖ ఎందుకు స్పందించ డం లేదని సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు.