సిద్దిపేట టౌన్,జూన్ 4 : ప్రభుత్వ పాఠశాల పరిరక్షణే ఎస్టీయూ లక్ష్యమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ అన్నారు. సిద్దిపేట ఎన్జీవోస్ భవన్లో బుధవారం ఎస్టీయూ రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హజరై మాట్లాడుతూ..ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏఒక్క హామీ అమలు కాలేదన్నారు.
ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీసీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, జీవో 317ను సమీక్షించి బాధిత ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బదిలీలకు సంబంధించిన శాశ్వత క్యాలెండర్‌ను రూపొందించాలని కోరారు.
ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పీఆర్సీ ప్రకటించి 6 నెలల్లోపుపు సిఫార్సులను అమలు చేస్తామ ప్రభుత్వం ఇచ్చిన హామీ విస్మరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా కాలాయాపన చేయకుండా త్రిసభ్య అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో సంఘం నేతలు సదయ్య, గజేందర్, రవి, పోల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవీంద్ర, రమేష్‌కుమార్, శీతల్ చౌహాన్, పట్నం భూపాల్, రవీందర్‌రెడ్డి, యాదగిరి, లింగారెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.