Road Accident | మెదక్ : రామాయంపేట వెళ్లే మార్గంలో గంగాపూర్ చెరువు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం, ఆటో ఢీకొనడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అప్పటికే ఆ మార్గంలో వస్తున్న మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. తన వెంట ఉన్న క్యూఆర్టీ (QRT) సిబ్బందిని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సిబ్బంది అక్బర్, హరీష్, యాదగిరి చాకచక్యంగా వ్యవహరించి క్షతగాత్రులను బయటకు తీశారు. అక్కడ ఒక్క స్ట్రెచర్ మాత్రమే ఉండగా, కాలు విరిగిన మహిళను కానిస్టేబుల్ యాదగిరి స్వయంగా చేతులపై ఎత్తుకుని అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని రోడ్డుపక్కకు జరిపి ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్లియర్ చేశారు. త్వరగా స్పందించి సహాయక చర్యలు చేపట్టిన సిబ్బందిని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు.

Nithiin | లీడింగ్ బ్యానర్లో నితిన్ కొత్త సినిమా.. ఈసారైనా హిట్టు పడేనా..?
Hardik Pandya: మహికా శర్మకు 1.7 కోట్ల ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా