కంది, ఫిబ్రవరి 1: నూతన ప్రాజెక్టుల రూపకల్పనలో ఫీస్ట్ సాఫ్ట్వేర్ కీలక పాత్ర పోషిస్తుందని విక్రం సారాబాయి స్పేస్ సెంట్రర్ డెరెక్టర్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో శనివారం 8వ నేషనల్ ఫినైట్ ఎలిమెంట్ డెవలపర్స్ ఫీస్ట్ యూజర్స్ మీట్ నిర్వహించారు. ఇస్రో దేశీయంగా అభివృద్ధి చేసిన స్ట్రక్చరల్ అనాలిస్ ఫీస్ట్ సాఫ్ట్వేర్ను ప్రచారం చేసేందుకు ఐఐటీహెచ్లో నిర్వహించిన యూజర్ మీట్స్ను ఆయన ప్రారంభించారు. పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, విద్యాసంస్థల నుంచి 250 మందికి పైగా ఇందులో పాల్గొన్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ప్రముఖ కేంద్రం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్ మాట్లాడుతూ.. ఫీస్ట్ సాఫ్ట్వేర్ సామర్థ్యాలు, స్వదేశీ సాఫ్ట్వేర్ అభివృద్ధి అంతరిక్ష పరిశోధనలకు దోహదపడతాయని తెలిపారు. ఐఐటీహెచ్ డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ.. ఫీస్ట్ సాఫ్ట్వేర్ తయారీ రంగంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ దేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఏకే అష్ఫ్,్ర ప్రొఫెసర్లు, విద్య, పరిశ్రమల సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.