మద్దూరు (ధూళిమిట్ట): సిద్దిపేట జిల్లా మద్దూరు ఎంపీడీవోగా చిలుముల శ్రీనివాస్, సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మద్దూరు ఎంపీడీవో గా పనిచేసిన సోమిశెట్టి రామ్మోహన్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలానికి బదిలీపై వెళ్లగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో ఎంపీడీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ మద్దూరు ఎంపీడీవోగా బదిలీపై వచ్చారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో సోమిశెట్టి రామ్మోహన్, నూతన ఎంపీడీవో శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ రాజు, ఎంపీఓ గద్ద వెంకటేశ్వర్లు, ఏపీవో మంజుల, జూనియర్ అసిస్టెంట్ రాజశేఖర్, తదితరులు ఉన్నారు.