Doulthabad Road | ఈ మెయిన్ రోడ్డుపై వెళ్లాలంటే నరకమే.. నాట్లు వేసి గ్రామస్తుల నిరసన
Doulthabad Road | మాచిన్పల్లి నుంచి దౌల్తాబాద్ మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి చాలాకాలంగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో పలుచోట్ల పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయని గ్రామస్తులు తెలిపారు. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలిచి రహదారి పరిస్థితి మరింత దారుణంగా మారుతోందన్నారు.
Doulthabad Road | దౌల్తాబాద్, ఆగస్టు 26 : అది నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారి. అయితే రోడ్డుపై ఏర్పడిన గుంతలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. నిత్యం బిక్కుబిక్కుమంటూ రాకపోకలు కొనసాగిస్తున్న తమ గోడును పట్టించుకునేవారే లేరా అంటూ దౌల్తాబాద్ మండలంలోని మాచిన్పల్లి గ్రామస్తులు వినూత్నంగా నిరసనకు దిగారు. దౌల్తాబాద్ మండలంలోని మాచిన్పల్లి గ్రామంలో రహదారి అధ్వానంగా మారింది. గ్రామస్తులు రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో వాటిలో నాట్లు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు.
మాచిన్పల్లి నుంచి దౌల్తాబాద్ మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి చాలాకాలంగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో పలుచోట్ల పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయని గ్రామస్తులు తెలిపారు. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలిచి రహదారి పరిస్థితి మరింత దారుణంగా మారుతోందన్నారు. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మండల కేంద్రానికి వెళ్లాలంటే అవస్థలే..
విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు నిత్యం ఈ రహదారిపైనే ప్రయాణించాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. గుంతల కారణంగా వాహనాలు నెమ్మదిగా నడపాల్సి వస్తోందని, ప్రయాణ సమయం పెరుగుతోందన్నారు. రాత్రివేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
వెంటనే మరమ్మతులు చేపట్టాలి..
రహదారి సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని గ్రామస్తులు ఆరోపించారు. ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో గుంతల్లో నాట్లు వేసి నిరసన చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిని పరిశీలించి గుంతలను పూడ్చడంతో పాటు నాణ్యమైన రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

