పాలనలో కాంగ్రెస్ ఘోరంగా విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలైనా ప్రజా పాలనలో ఘోరంగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. చేగుంటలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నదన్నారు.
- రైతు రణమాఫీ, 24 గంటల కరెంట్‌పై సరైన వైఖరి లేదు
- పాఠశాలలు ప్రారంభమై 15 రోజులైనా విద్యార్థులకు చేరని పుస్త్తకాలు
- బీఆర్ఎస్ నాయకులపై కక్షసాధింపు చర్యలు సరికాదు
- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
చేగుంట, జూన్ 22: కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలైనా ప్రజా పాలనలో ఘోరంగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. చేగుంటలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నదన్నారు. ప్రభు త్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. ప్రతిపక్షనేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు కూడా చేయనీయడం లేదని, గ్రామ పంచాయతీ శానిటేజర్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందన్నారు. రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. పాఠశాలలు ప్రారంభమై 15రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పుస్తకాలు పంపిణీ చేయలేదన్నారు. దుబ్బాక, తొగుట, మిరుదొడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఇన్చార్జి మంత్రిగా కొండ సురేఖ రానిదని, ఎలాంటి అభివృద్ధి పనులు చేయరాదని, ఉన్నతాధికారులకు ఆదేశాలు ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సముచిత న్యాయం, గౌరవం ఇచ్చిందన్నారు.
ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి
ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. చేగుంటలోని ఎరువుల దుకాణాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఎరువులు, విత్తనాల నిల్వలపై ఆరా తీశారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలని సూచించారు. అనంతరం చేగుంటలో మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్ తండ్రి సుదర్శనం అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటికొ చ్చిన సందర్భంగా ఎమ్మెల్యే తదితరులు పరామర్శించారు.
కన్యకాపరమేశ్వరికి కుంకుమార్చనలు
చేగుంటలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ 19వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వేద పండితుడు సీతారామ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, నగరేశ్వరస్వామికి విశేష ఫల పంచామృతాలతో అభిషేకం, అన్నదానం లాంటి పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమండ్ల నారాయణరెడ్డి, జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, సుభాష్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, నాయిని రాజ్‌గోపాల్, నార్సింగి జడ్పీటీసీ బాణపుర కృష్ణారెడ్డి, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు నగేశ్, రాజేశ్వర్, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, తీగుల్ల వేణుగోపాల్‌శర్మ, శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలి
చేగుంటలోని 330 సర్వే నంబర్లో ఉన్న భూమిని పేదలకు పంచాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి సీఐటీయూ నాయకురాలు బాలమణి వినతి పత్రం అందజేశారు. శనివారం చేగుంటకు వచ్చిన సందర్భంగా ఆయనను కలిశారు. మాజీ మిల్టెంట్తో పేరిట ఎకరంన్నర భూమిస్తే మూడెకరాలు కబ్జా చేసి కంపౌండ్ వాల్ కట్టారన్నారు. ఆమెతో శివరాజ్, నర్సింహులు, సత్యనారాయణ ఉన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

