రాయపోల్ జులై 29 : గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని వ్యవసాయ శాఖ గజ్వేల్ డివిజన్ ఎడీఏ. రాయపోల్ మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్ పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో రైతు వేదిక కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. వర్షాకాలం సీజన్ కావడం వలన గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు వీధులను పరిశుభ్రంగా ఉంచే విధంగా పంచాయతీ కార్యదర్శిలు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించి డ్రై డే కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని ఆయన సూచించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని. సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు. గ్రామస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేస్తే గ్రామాల్లో సమస్యలు పరిష్కారం చెందుతాయని ఆయన గుర్తు చేశారు.
అన్ని శాఖల అధికారులు సమయపాలన పాటించి విధులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని. మురికి కాలువలు పరిశుభ్రంగా ఉండాలని. చెత్తా చెదారం ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్లకు తరలించాలని సూచించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మండల మార్కెట్ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య. ఉమ్మడి మండల సొసైటీ చైర్మన్ అన్నా రెడ్డి గారి వెంకట్ రెడ్డి. తాసిల్దార్ కృష్ణమోహన్. ఎంపీడీవో శ్రీనివాస్. వివిధ గ్రామాల సర్పంచులు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.