‘రైతుబంధు గివ్ ఇట్ అప్’
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన గాదగోని చక్రధర్ గౌడ్, కనకలక్ష్మి తనకున్న 10ఎకరాల భూమికి రైతుబంధు పథకం ద్వారా వచ్చిన డబ్బులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు గురువారం తిరిగి అందజేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ అధికారి శివకుమార్ సమక్షంలో రైతుబంధు తమకు వద్దని, తమ డబ్బులను ఫ్రీజ్ చేసి
- తిరిగి ఇచ్చిన ఇబ్రహీంపూర్వాసులు
- పేద రైతులకు న్యాయం చేద్దామని పిలుపు
- అభినందించిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేట అర్బన్, జూలై 21 : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన గాదగోని చక్రధర్ గౌడ్, కనకలక్ష్మి తనకున్న 10ఎకరాల భూమికి రైతుబంధు పథకం ద్వారా వచ్చిన డబ్బులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు గురువారం తిరిగి అందజేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ అధికారి శివకుమార్ సమక్షంలో రైతుబంధు తమకు వద్దని, తమ డబ్బులను ఫ్రీజ్ చేసి, వాటిని వేరే రైతులకు అందజేయాలని వినతి పత్రం అందజేశారు. దీంతో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వారిని అభినందించారు.
ఈ సందర్భంగా ఫార్మర్స్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ ఆర్థికంగా ఉన్నవారు రైతుబంధు పొందడం సరైంది కాదని, ఇప్పటికైనా రైతుబంధు తిరిగి ఇచ్చేసి కష్టపడుతున్న రైతులకు అందేలా చూడాలని కోరారు. రైతులపై ప్రేమతోనే ‘రైతుబంధు గీవ్ ఇట్ అప్’ అంటూ తిరిగి వెనక్కి ఇచ్చేశామని తెలిపారు. తనకు రైతుబంధు అవసరం లేదని, తనలా అందరూ ఆలోచించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రైతుబంధు వెనక్కి ఇచ్చి నిరుపేద, చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మర్స్ ఫౌండేషన్ సభ్యు లు శ్రవణ్ కుమార్ గౌడ్, కస్తూరి హరీశ్, ప్రశాంత్, సతీష్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

