
దుబ్బాక, జూలై 6 : పల్లె ప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో మంగళవారం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కారులోనే పల్లెలు నిజమైన అభివృద్ధి సాధించాయన్నారు. ఎంపీ వెంట జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కైలాశ్, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, నాయకులు కిషన్‌రెడ్డి, బండి రాజు ఉన్నారు.
ప్రభుత్వ స్థలాలపై నివేదిక ఇవ్వాలి
దౌల్తాబాద్, జూలై 6 : రైతు శ్రేయస్సే ప్రభుత్వం లక్ష్యమని మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గుప్త్తా, జడ్పీటీసీ జ్యోతీశ్రీనివాస్గౌడ్తో కలిసి ప్రజాప్రతినిధులతో గిడ్డంగుల నిర్మాణంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మా ట్లాడుతూ… రైతులు పండించిన పంట ఉత్పత్తులను భద్రపర్చడానికి అనువైన ప్రాంతాల్లో గిడ్డంగులను నిర్మిస్తామ న్నారు. రాబోయే రోజుల్లో వరి సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నారు. గ్రామాల్లో 5 నుంచి 10 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంటే గిడ్డంగులను నిర్మిస్తామని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి, నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ నీలిమాను ఆదేశించారు. ఆనంతరం దౌల్తాబాద్‌లో నిర్మించిన గిడ్డంగితోపాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్మించిన మహిళా సహాయ కేంద్రాన్ని పరిశీలించారు.
పరిశుభ్రత – పచ్చదనం పెంపొందించాలి
పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల్లో పరిశుభ్రతతోపాటు పచ్చదనం పెంపొందించాలని సర్పంచ్‌లు, అధికారులకు సూచించారు. గతంలో చేపట్టిన పల్లె ప్రగతి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన..
దౌల్తాబాద్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఎంపీ తనిఖీ చేసి, వైద్యసేవలు పరిశీలించారు. దవాఖానకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. కార్యక్రమా ల్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు రహీమొద్దీన్, మండల కోఆప్షన్ సభ్యుడు హమ్మద్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు ఆది వెంకన్న, సర్పంచ్‌లు చిత్తారిగౌడ్, లతామధుసూదన్రెడ్డి, సురేందర్‌రెడ్డి యాదగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్ర సత్యం, డైరెక్టర్లు అశోక్‌గుప్తా, రమేశ్, ఎంపీటీసీలు వనిత, బండారు దేవేందర్, వీరమ్మమల్లేశం, తిరుపతి, నేతలు మోహన్‌రావు, వెంకట్ రెడ్డి, నర్సింహారెడ్డి, నర్ర రాజేందర్, రాజిరెడ్డి పాల్గొన్నారు.
‘వెద’తో పెట్టుబడి మిగులు
రాయపోల్, జూలై 6 : కూలీల ధరలు, పెట్టుబడి పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో తక్కువ ఖర్చుతో వరిని సాగు చేసే వెదజల్లే విధానంతోనే రైతులకు బంగారు భవిష్యత్ ఉందని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రాయపోల్ మండలం వడ్డెపల్లిలో రైతు రాయగారి శ్రీనివాస్ పొలం లో వెదజల్ల్లే పద్ధ్దతిని పరిశీలించారు. ఎంపీ స్వయంగా పొలంలో దిగి వరి విత్తనాలు చల్లారు. కాళేశ్వరం నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగాయని, వరి సాగు విస్తీ ర్ణం పెరిగిందన్నారు. ఎంపీ వెంట డీపీవో పార్థసారథి, ఎం పీపీ అనితాశ్రీనివాస్, జడ్పీటీసీ యాదగిరి, ఎంపీడీవో రాజేశ్‌కుమార్, ఎంపీవో శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి, సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ ప్రభాకర్, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు వెంకటేశ్వరశర్మ, నేతలు బక్కి వెంకటయ్య, రాజేశ్వర్‌రెడ్డి, కో ఆప్షన్‌సభ్యుడు పర్వేజ్ అహ్మద్ ఉన్నారు.