సిద్దిపేట, ఫిబ్రవరి 19 : సిద్దిపేట అభివృద్ధిని చూసి ఆశ్చర్యానికి గురయ్యామని, నాడు కేసీఆర్ సిద్దిపేట అభివృద్ధ్దికి బాటలు వేశారని, నేడు ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేటను దేశానికే తలమానికంగా మార్చారని మాజీఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ అన్నారు. ఫరూక్ హుస్సేన్‌తోపాటు చదువుకున్న పాఠశాల, కళాశాల మిత్రులతో బుధవారం సిద్దిపేటలో ఆత్మీ య సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత కలిసిన ఆప్తమిత్రులకు రంగనాయక సాగర్, సిద్దిపేట కోమటి చెరువు, మెడికల్ కళాశాల, మల్లన్న సాగర్ లాంటి అభివృద్ధి పనులను ఆయన చూపించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో మిత్రులతో కలిసి ఫరూక్ హుస్సేన్ మాట్లాడారు.1985లో కేసీఆర్ అభివృద్ధికి నాంది పలికితే, హరీశ్‌రావు అభివృద్ధి కొనసాగిస్తూ తెలంగాణకు తలమానికంగా తీర్చిదిద్దారన్నారు. ఈ సం దర్భంగా ఫరూక్హుస్సేన్ మిత్రుడు హబీబ్ మాట్లాడుతూ.. 40 ఏండ్ల కింద తాము సిద్దిపేట వదిలి వెళ్లామని, ఫరూక్ హుస్సేన్ వల్ల తిరిగి సిద్దిపేటలో కలుసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూసి ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపారు. గతం లో సిద్దిపేట ప్రాంతంలో నీటి కటకట ఉండేదని, ఇప్పుడు అద్భుతమైన నీటి వసతి కల్పించారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నీరు అందించడం గొప్ప విషయమన్నారు. ఎటు చూసినా చకటి రోడ్లు, ప్రకృతి వనాలు, మెడికల్, ఎడ్యుకేషన్ హబ్‌లు కనిపిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో షేఖ్ అహ్మద్ అయాజ్, సికిందర్, జహీర్ ఇక్బాల్, తాబరిక్ అలీ, జబీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.