Ramayampet | రామాయంపేట, జూన్ 06: తమకు ఇవ్వాల్సిన రెండు నెలల జీతాలు, పీఎఫ్ డబ్బులు ఇస్తేనే పనుల్లో చేరుతామని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపారు. రామాయంపేట మున్సిపల్ కార్యాలయం ముందు శుక్రవారం నాడు ధర్నాకు దిగారు. జీతాలిచ్చేంత వరకు పనుల జోలికి వెళ్లమని తేల్చిచెప్పారు. జీతాలు ఇస్తేనే తమ కుటుంబాలు గడుస్తాయని, లేదంటే పస్తులుండక తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు.
జీతాలివ్వాలని రెండు నెలలుగా సంబంధిత మున్సిపల్కమిషనర్ను ఎన్నిసార్లు అడిగినా తప్పించుకుని తిరుగుతున్నారని పారిశుద్ద్య కార్మికులు తెలిపారు. పారిశుద్ధ్య పులు చేయడం వల్ల వింత జబ్బుల బారిన పడాల్సి వస్తుందని.. కనీసం ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుందామన్నా చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.