మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 5: ఇటీవల మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్ తండ్రి మృతి చెందాడు. శనివారం మంత్రి హరీశ్‌రావు, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నర్సాపుర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ పరామర్శించారు. వారి వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ జగపతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్అశోక్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, జయరాజ్,శ్రీనివాస్, సమియొద్దిన్, టీఆర్ఎస్ నేతలు గంగాధర్, కృష్ణాగౌడ్, జీవన్‌రావు, వేణుగోపాల్‌రావు, కిరణ్, స్వామినాయక్, ముజీబ్, ఉమర్, సాధిక్, బాల్‌రాజ్ ఉన్నారు.
బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ
చిన్నశంకరంపేట, ఫిబ్రవరి 5: రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ సత్యనారాయణరెడ్డిల తల్లి లక్ష్మమ్మ ఇటీవల మృతి చెందింది. మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే హనుమంతరావు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతప్రభాకర్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, నర్సాపూర్, మెదక్ మున్సిపల్ చైర్మన్లు మురళీయాదవ్,చంద్రపాల్ పరామర్శించారు. సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ యాదగిరి ఉన్నారు.
శివ్వంపేట, ఫిబ్రవరి 5 : మెదక్ జిల్లా జడ్పీకో ఆప్షన్ సభ్యుడు మన్సూర్ తల్లి జహేదాబేగం ఇటీవల మృతి చెందింది. ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డిలతో కలిసి మంత్రి తన్నీరు హరీశ్‌రావు పరామర్శించారు. మంత్రి వెంట ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్‌గుప్తా, నర్సాపూర్ మున్సిపాల్ చైర్మన్ మురళీయాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హబీబ్‌ఖాన్, సీనియర్ నాయకుడు శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.