Collector Kranthi Valluru | భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ కోర్టుల పునరుద్ధరణ.. సులభంగా భూ సమస్యలు పరిష్కారం : కలెక్టర్ క్రాంతి వల్లూరు
భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ, తోటి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన మొగుడుంపల్లి గ్రామంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టం అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ క్రాంతి వల్లూరు మాధురితో కలిసి పాల్గొన్నారు.
Collector Kranthi Valluru | జహీరాబాద్ , ఏప్రిల్ 21 : భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ, తోటి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు.
ఇవాళ సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన మొగుడుంపల్లి గ్రామంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టం అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ క్రాంతి వల్లూరు మాధురితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ భారతి చట్టం ద్వారా రైతులకు చేకూరే ప్రయోజనాల గురించి ఒక్కో అంశం వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు.
భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూ భారతి (ఆర్ఓఆర్) చట్టం-2025 జనవరిలో గెజిట్ రూపంలో వచ్చిందని, సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 14న ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ వివరించారు.
ఏడాది కాలంలోపు దరఖాస్తులు చేసుకోవాలి..
భూ సమస్యలు కలిగిన రైతులు ఏడాది కాలంలోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. భూ భారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్‌కు లేదా సీసీఎల్ఏకు అప్పీల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని సూచించారు.
ధరణిలో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా ఇదివరకటి తరహాలోనే రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు.
భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారికి, కలెక్టర్‌కు అధికారాలు కల్పించారని తెలిపారు. అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు. ఆర్థిక స్థోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.
రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం సరైంది కాదని భావిస్తే కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే ల్యాండ్ ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు. కాగా ప్రతీ గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి, ప్రతీ సంవత్సరం గ్రామాలలో రికార్డ్ డిస్ ప్లే చేయడం జరుగుతుందని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
సాదాబైనామా పరిష్కారం కోసం..
ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికార్డులు భూ భారతి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు జిల్లాల్లో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. వీటికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడనున్నాయని తెలిపారు.
జిల్లా అదనపు కలెక్టర్ మాధురి మాట్లాడుతూ.. భూ భారతి చట్టంపై ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. ఈ సదస్సుల్లో ఆర్డీవో రామిరెడ్డి, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.


Read Also :
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
Road Accident | నెలాఖరులో పదవీ విరమణ..అంతలోనే రోడ్డుప్రమాదం.. ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

