జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మీర్జాపూర్(బి) కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక కాయకల్ప అవార్డును గెలుచుకుంది. 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖ ఈ అవార్డును అందజేసింది. దీనితో పాటు లక్ష రూపాయల నగదు బహుమతిని కూడా అందజేశారు. కొన్ని నెలల క్రితం ప్రత్యేక బృందాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్వచ్ఛత రోగులకు వారి అటెండెంట్లకు అందుతున్న సదుపాయాలు బయోమెడికల్ రిజిస్టర్ నిర్వహణ ఇన్స్పెక్షన్ కాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు పారిశుధ్య రికార్డుల నమోదు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని జాతీ ఆరోగ్య మిషన్ బృందం మార్కులను వేసింది.
ప్రత్యేక బృందం వేసిన మార్పుల ఆధారంగా రాష్ట్రస్థాయిలో 37వ స్థానంలో స్థానిక కమ్యూనిటీ సెంటర్ నిలువగా, జిల్లాస్థాయిలో నాలుగో స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ ప్రియాంక హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కమ్యూనిటీ సెంటర్కు వైద్యం కోసం వచ్చే రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.