Drugs Seized | సంగారెడ్డిలో డ్రగ్స్ కలకలం.. ఫామ్‌హౌస్‌పై దాడి రూ.6.5కోట్ల ముడిసరుకు సీజ్
Drugs Seized | సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపింది. కోహీర్ మండలంలోని మారుమూల గ్రామమైన పీచేర్యాగడి తండాలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఫామ్‌హౌస్ వేదికగా సాగుతున్న ఈ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని మహారాష్ట్ర పోలీసులు బట్టబయలు చేశారు.
Drugs Seized | సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపింది. కోహీర్ మండలంలోని మారుమూల గ్రామమైన పీచేర్యాగడి తండాలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఫామ్‌హౌస్ వేదికగా సాగుతున్న ఈ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని మహారాష్ట్ర పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఆపరేషన్ స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్ర పోలీసులు మెరుపుదాడి నిర్వహించి, మూడు కిలోల మెఫెడ్రోన్, డ్రగ్స్ తయారీకి వాడే ముడిపదార్థాలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఈ ముడిపదార్థాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.6.5 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ తయారీ ముడిపదార్థాలు ముంబై నుంచి తీసుకొచ్చినట్లుగా గుర్తించారు.
మారుమూల ఫామ్‌హౌస్‌ను అడ్డగా మార్చుకుని, డ్రగ్స్ తయారు చేసి, వాటిని ముంబైతో పాటు ఇతర మెట్రో నగరాలకు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ అక్రమ డ్రగ్స్ తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి ముంబైకి తీసుకెళ్లారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
Surprise Inspections | కొత్తగూడెంలో తూనికలు, కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు
Indian Railways | దీపావళి వేళ దక్షిణ మధ్య రైల్వే అలర్ట్.. వీటిని రైళ్లలో అస్సలు తీసుకురావద్దంటూ రిక్వెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

