హత్నూర, అక్టోబర్ 02 : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోరుపట్ల గ్రామ పంచాయతీకి చెత్త సేకరణ కోసం ఎపిటోరియా పరిశ్రమ యాజమాన్యం సీఎస్ఆర్ నిధుల ద్వారా చెత్త సేకరణ వాహనాన్ని(ఆటో) బహూకరించినట్లు సర్పంచ్ గంగారెడ్డి తెలిపారు. గ్రామంలో చెత్త సేకరణ కోసం ఎపిటోరియా పరిశ్రమ సీఎస్ఆర్ నిధుల నుండి వాహనాన్ని అందించడం అభినందనీయమన్నారు.
ఎపిటోరియా పరిశ్రమ, అరబిందో సంస్థల సహకారంతో గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ సహకరిస్తుందని సర్పంచి తెలిపారు. పరిశ్రమ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమ నిర్వహణ అధికారి ఎన్వి రమణ, సిఎస్ఓ సుధీర్, హెచ్ఆర్ మేనేజర్ శోభన్ బాబు, ఉప సర్పంచ్ కృష్ణ, నాయకులు ,భాస్కర్ రెడ్డి, పవన్,రాజిరెడ్డి, ఆంజనేయులు, అశోక్ పాల్గొన్నారు.