Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
Crude oil tanker hit | యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సముద్ర తీరంలో ఒక చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరిగింది. అయితే అందులో ఉన్న 19 మంది భారతీయ నావికులతో సహా మొత్తం 22 మంది సిబ్బందిని యూఏఈ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించింది.
న్యూఢిల్లీ: యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సముద్ర తీరంలో ఒక చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరిగింది. అయితే అందులో ఉన్న 19 మంది భారతీయ నావికులతో సహా మొత్తం 22 మంది సిబ్బందిని
యూఏఈ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించింది. కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తెలిపింది. (Crude oil tanker hit) బుధవారం యూఏఈలోని మినా సాకర్ సమీపంలో లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ముడి చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరిగినట్లు ఆ శాఖల కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. కొట్టుకుపోతున్న ‘ఎంటీ డొమినికా ప్రాస్పెరిటీ’ అనే ఆయిల్ ట్యాంకర్‌లోని 19 మంది భారతీయులతో సహా 22 మంది సిబ్బందిని యూఏఈ కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించినట్లు చెప్పారు. వారందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు వివరించారు.
కాగా, నవంబర్ 11న హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించిన సౌదీ అరేబియా జెండా కలిగిన చమురు ట్యాంకర్ కూడా దాడి ముప్పును ఎదుర్కొన్నదని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. అయితే అందులోని ముగ్గురు భారతీయ నావికులతో సహా సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు వివరించారు.
మరోవైపు భారత నావికుల భద్రత, అవసరమైన సహాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం షిప్ మేనేజ్మెంట్ కంపెనీతో సమన్వయం చేసుకుంటోందని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. అక్కడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
Priyanka Gandhi | బీజేపీ, ఆరెస్సెస్ విదేశీ అంటూ నా తల్లిని విమర్శించాయి : ప్రియాంక గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

