
హవేళీఘనపూర్, ఆగస్టు 23 : మల్లన్న దీవెనలతో నియోజకవర్గంలో పంటలు బాగా పండి, ప్రజలు ఆయురారోగ్యాలతో చల్లంగుండాలని మల్లన్నస్వామికి మొక్కుకున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొత్తపల్లిలో నూతనంగా నిర్మించిన మల్లన్న దేవాలయంలోని స్వామి వారికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు, గ్రామ సర్పంచ్ సంధ్యారాణి తీర్థ ప్రసాదాలు అందజేసి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడారు. కొత్తపల్లి గొల్లకుర్మ సంఘ సభ్యులందరూ ఐక్యతతో ఉండి మల్లన్న దేవాలయాన్ని నిర్మించి, విగ్రహాలను ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు. కొత్తపల్లి గ్రామ అభివృద్ధి కోసం తమవంతుగా సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మెదక్ మండల అధ్యక్షుడు అంజాగౌడ్, సర్పంచ్‌లు సంధ్యారాణి, కిషన్, మహిపాల్‌రెడ్డి, సాయాగౌడ్, చెన్నాగౌడ్, యామిరెడ్డి, ఎంపీటీసీ మంగ్యా, టీఆర్ఎస్ నాయకులు జయపాల్‌రెడ్డి, స్వామినాయక్, భిక్షపతి, రాంజ్యానాయక్, ఫూల్సింగ్, రేఖమయ్య, ఉప సర్పంచ్ శేఖర్‌రెడ్డి, ఆలయ నిర్వాహకులు మల్లన్నతో పాటు గొల్లకుర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీకి ఘన స్వాగతం..
హవేళీఘనపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి వచ్చిన సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డికి ఎంపీటీసీ అర్చనశ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు బూర్గుపల్లి పెద్దమ్మ దేవాలయంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు శాలువాతో వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బూర్గుపల్లి, గాజిరెడ్డిపల్లి టీఆర్ఎస్ నాయకులు బాల్‌రాజ్, పోచయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత..
మండల కేంద్రమైన హవేళీఘనపూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 20 మంది లబబ్ధిదారులకు వైద్య చికిత్స కోసం రూ.6,72,600 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం మండల పరిధిలోని కూచన్పల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అందజేశారు. ఎమ్మెల్సీ వెంట ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచ్‌లు దేవాగౌడ్, మహిపాల్‌రెడ్డి, యామిరెడ్డి, సవిత, ఎంపీటీసీ మంగ్యా, ఉప సర్పంచ్ బయ్యన్న, టీఆర్ఎస్వీ నాయకులు అజ్మీరా స్వామినాయక్, టీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్, సిద్దిరెడ్డి, శ్రీనునాయక్, రమేశ్, ఫూల్సింగ్ ఉన్నారు.
అందరూ గులాబీ సైనికులే
ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
రామాయంపేట, ఆగస్టు 23 : మనమందరం గులాబీ సైనికులమని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉన్నదని సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా రామాయంపేటకు వచ్చిన ఎమ్మెల్సీ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘దళితబంధు’ అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారన్నారు. మునుపెన్నడూ లేనంతంగా మెదక్ జిల్లాలోని మెదక్ నియోజకవర్గం అభివృద్ధిలో ముందుందన్నారు. రామాయంపేట అభివృద్ధికి సీఎం నిధులు ఇచ్చారన్నారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే ముఖ్యమన్నారు. ఎమ్మెల్సీ వెంట నిజాంపేట జడ్పీటీసీ విజయ్ కుమార్, టీఆర్ఎస్ నాయకుడు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి అక్షయ్ కుమార్, సురేశ్ నాయక్ తదితరులు ఉన్నారు.