ట్రిపుల్ఆర్కు భూములివ్వం
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. భూములు కోల్పోతున్న తమకు భూమికి భూమి ఇవ్వాలని, లేకపోతే బహిరంగ మార్కెట్లో భూములకు పెరిగిన ధరల ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా కొండాపూర్ మండల పరిధిలోని గిర్మాపూర్, సదాశివపేట మండల పరిధిలోని పెద్దాపూర్ శివారులో అధికారులు డిజిటల్ భూ సర్వే నిర్వహించారు.
- సంగారెడ్డి జిల్లా కొండాపూర్, సదాశివపేట మండలాల పరిధిలో రైతుల ధర్నా
- రైతుల అరెస్టు, స్టేషన్‌కు తరలింపు
- పోలీసు బందోబస్తు మధ్య భూసర్వే
సదాశివపేట, ఆగస్టు 8: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. భూములు కోల్పోతున్న తమకు భూమికి భూమి ఇవ్వాలని, లేకపోతే బహిరంగ మార్కెట్లో భూములకు పెరిగిన ధరల ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా కొండాపూర్ మండల పరిధిలోని గిర్మాపూర్, సదాశివపేట మండల పరిధిలోని పెద్దాపూర్ శివారులో అధికారులు డిజిటల్ భూ సర్వే నిర్వహించారు.
సర్వేకు ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా ముందస్తుగా భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. త్రిబుల్ఆర్ రింగ్ రోడ్డు వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి భూసర్వే చేయాలని డిమాండ్ చేశారు. తమ తాతల కాలం నుంచి వస్తున్న భూములను కోల్పోతే తమకు జీవనోపాధి లేకుండా పోతుందని, భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అనంతరం జాతీయ రహదారి 65పై ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తు న్న రైతులను పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

