పుల్కల్, అక్టోబర్ 10: ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం గురువారం మండలంలోని బస్వాపూర్ శివారులో 417 సర్వే నెంబర్‌ను సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభు త్వం అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్‌ను నిర్మించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ప్రభుత్వం తొందరలోనే రెసిడెన్సియల్ కాంప్లెక్స్ పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
అందులో భాగంగానే బస్వాపూర్ శివారులోని 417 సర్వే నంబర్లో 20 ఎకరాలను గుర్తించామని కలెక్టర్‌కు తహసీల్దార్ కృష్ణ వివరించారు. ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంటుందని తహసీల్దార్‌ను ప్రశ్నించగా 33 ఎకరాలు ఉం టుందని తెలిపారు. దీంతో కలెక్టర్ 20 ఎకరాలతో పాటు మరో 5 ఎకరాలు కూడా చదును చేసి ఉం చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్ట ర్ వెంట ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఆర్అండ్బీ అధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.