హుస్నాబాద్‌టౌన్, మే 6: “నేను తీసుకున్న రు ణం తీర్చమనలేదు…. నాకు ఉచితంగా ఇల్లు కట్టించమనలేదు… నాకు ఉచిత కరెంట్ బిల్లుకట్టమని చెప్పలేదు. నాకు ఉచితంగా పింఛన్ కావాలని కోరలేదు.. తక్కువ రేటుకు గ్యాస్ సిలిండర్ కావాలని అడగలేదు… నాకొడుకు సైకిల్‌పై వెళ్లి ఇంజినీరింగ్ కాలేజీలో ఫీజు కడితే… నాతో కారులో వచ్చిన వ్యక్తి ఫీజు కూడా కట్టలేదు.. కారణం తెల్లరేషన్‌కార్డు నాకు లేదు కాబట్టి.. నా భూమి పండించడానికి ఎకరానికి పదిహేనువేల రూపాయలు కావాలని అడిగా…
నేను ట్యాక్స్‌లు సైత కట్టా. నేను కష్టపడి దాచుకున్న జీఫీఎఫ్ డబ్బులు ఇవ్వకపోతే ఎలా” అంటూ హుస్నాబాద్ ఆర్టీసీ బస్‌డిపోలో కండక్టర్‌గా పనిచేసి ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన బూర వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాట్యూటీలేదు. ఫిట్మెంట్ ఇవ్వలేదు… నిజంగా ఎంతమంది ఉచితాలకు అర్హులు… ఎంతఅయినా ఇచ్చుకోండి.. మేము వద్దు అనలేదు. కానీ దయచేసి మావి మాకు ఇవ్వండి. మేము ఓట్లువేశాం. మమ్ములను మనుషులుగా గుర్తించండి..
రాత్రి, పగలు డ్యూటీలు చేసినం. సగం రాత్రులు రాత్రి డ్యూటీలోనే కిలిసిపోయాయి. ఎంతకష్టపడి ప్రభుత్వానికి, ప్రజలకు సేవచేసినం. జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బులు ఇవ్వకపోతే ఎలా… పనికిరాని ప్రభు త్వం బానిసలుగా భావించకండి.. మా మీద కూడా దయచూపించండి… రిటైర్డు కాబోయే ఉద్యోగులరా మీరు ఆలోచించండి అంటూ బుర్ర వెంకన్న సోషల్ మీడియలో పెట్టిన కథనం వైరల్‌గా మారింది.