నర్సాపూర్, మార్చి 3: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్ష సోమవారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. నర్సాపూర్ మున్సిపల్ 3వ వార్డు వాసులు పలువురు సోమవారం రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డంపింగ్‌యార్డు ఏర్పడితే నర్సాపూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గాలి, నీరు కలుషితం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి డంపింగ్‌యార్డు నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో దావూద్, రిజ్వాన్, మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
గుమ్మడిదల, మార్చి 3: సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలం ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ గుమ్మడిదల, నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో రిలే నిరహార దీక్షలు సోమవారం 27వ రోజు కొనసాగాయి. గుమ్మడిదల మున్సిపల్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో బుడగజంగాల కులస్తులు దీక్ష చేపట్టారు.
రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, జేఏసీ నాయకులు సద్ది విజయ భాస్కర్ రెడ్డి, పుట్ట నర్సింగ్‌రావు, మూడుచింతల నరేందర్‌రెడ్డి, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, తులసీదాసు, ఉదయ్‌కుమార్ తదితరులు సంఘీభావం తెలిపారు. నల్లవల్లిలో శాలివాహన సంఘం కులస్తులు, కొత్తపల్లిలో పలువురు గ్రామస్తులు 27వ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. దీక్షల్లో రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, రైతు జేఏసీ నాయకులు లక్ష్మీనారాయణ, కావలి శంకర్‌యాదవ్, మోహన్‌రెడ్డి, మంద భాస్కర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కుమ్మరి ఆంజనేయులు, సురేశ్, రామకృష్ణ, కొత్తపల్లి మల్లేశ్‌గౌడ్, చాపల మధు, మహిళా జేఏసీ నాయకులు, యువకులు పాల్గొన్నారు.