తొగుట : మహిళల భద్రతకు ( Womens Security) , శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉంటారని తొగుట ఏఎస్ఐ రాంరెడ్డి ( ASI Ramreddy ) అన్నారు. తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాల బాలికలకు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్, ఇవ్టీజింగ్, పోక్సో, షీ టీమ్స్ ( She teams ) , యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి, అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్‌పై అవగాహన కల్పించారు.
సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుందని పేర్కొన్నారు. చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దని హితవు పలికారు, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని , డ్రగ్స్ , ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు . పిల్లలను , మహిళలను ఎవరైనా వేధిస్తే వెంటనే డయల్ 100 , సిద్దిపేట షీ టీమ్ వాట్సాప్ నెంబర్ 8712667434 కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. సామాజిక రుగ్మతల గురించి గజ్వెల్ షీటీమ్ బృందం ఏఎస్ఐ శ్రీరాములు, శ్యామల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ అజామత్ బేగమ్, , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.