మెదక్, మే 2(నమస్తే తెలంగాణ): భూ భారతి చట్టం ప్రకారం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిషారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్‌లతో కలిసి భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులు, నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మెదక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్వో భుజంగరావు, ఏఎస్పీ మహేందర్, జడ్పీ సీఈవో ఎల్లయ్య వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఈనెల 5 నుంచి మే 20 వరకు పైలట్ ప్రాజెక్టు జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో ఒక మండలాన్ని పైలట్‌గా తీసుకొని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. జూన్ 2వరకు పైలట్ ప్రాజెక్ట్ కింద వచ్చిన దరఖాస్తులు పరిషారానికి కృషి చేయాలన్నారు.
ఈ ప్రాజెక్టు కింద చేపట్టిన 4 మండలాల్లో రెవెన్యూ సదస్సుల్లో భూసమస్యలపై ప్రజల నుంచి 12,759 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. భూభారతి చట్టంలో దరఖాస్తు చేసుకునే సమయంలో సరిగ్గా దరఖాస్తు నమోదయ్యేలా హెల్ప్‌డెస్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూసర్వేకు సంబంధించిన సమస్యలు, ఆర్ఎస్ఆర్ ఎక్సస్ సమస్యలు పరిషరించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీవో శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ మాణిక్యం, డీపీఓ యాదయ్య, అధికారులు పాల్గొన్నారు.