మునిపల్లి, జూలై 20: గుట్టుచప్పుడు కాకుం డా మహారాష్ట్రకు తరలిస్తున్న 115 కిలోల గంజాయి, రూ.40వేలతోపాటు ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీఎం ఆదేశాల మేర కు శనివారం ఉదయం 8గంటల సమయంలో సంగారెడ్డి జిల్లా మునిపల్లి మం డలం కంకోల్ గ్రామ శివారులోని ముం బాయి జాతీయ రహదారిపై ఉన్న డెక్క న్ టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు నుంచి జహీరాబాద్ వైపు అక్రమంగా రెండు కార్లలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గం జాయి, డ్రగ్స్ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపా రు. ముంబయి జాతీయ రహదారిలోని టోల్‌ప్లాజాల వద్ద క్రమంతప్పకుండా వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.
ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో పం డించే గంజాయికి మంచి డిమాండ్ ఉందన్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగా ణ, కర్ణాటక, గోవాతోపాటు పలు రాష్ర్టాలకు గంజాయి అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ఒడిశా, ఏపీ రాష్ర్టాల నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న నిందితులు ఏక్నాథ్ ఖాదర్, అంజీనాథ్గహీనాథ్బాడేలను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఒరిస్సాలోని పతన్పూర్ మున్సిపాలిటీ రాయ్‌ఘడ్ జిల్లా నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు తీసుకెళ్తున్నట్లు నిందితులు తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ సీఐలు గాంధీనాయక్, వీణారెడ్డి, చంద్రశేఖర్, ఎస్సైలు అనిల్‌కుమార్, యాదయ్య, హెడ్‌కానిస్టేబుల్ అలీం, సిబ్బంది పాల్గొన్నారు.